Bollywood Actor Vivek Oberoi Fined For Rides Bike Without Helmet And Mask - Sakshi
Sakshi News home page

వీడియో షేర్‌ చేసిన హీరో, ఫైన్‌ వేసిన పోలీసులు

Published Sat, Feb 20 2021 1:30 PM | Last Updated on Sat, Feb 20 2021 2:41 PM

FIR Against Vivek Oberoi For For Not Wearing Mask on Bike With Wife - Sakshi

ముంబై : బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబేరాయ్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. వాలెంటైన్స్‌ డే సందర్భంగా వివేక్‌ భార్య ఆయనకు ఓ బైక్‌ని బహుమతిగా ఇచ్చింది. దీంతో అదే రోజు శ్రీమతిని బైక్‌పై ఎక్కించుకొని ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా వివేక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. అయితే వివేక్‌ హెల్మెట్‌ ధరించకపోవడంతో ఇది కాస్తా పోలీసుల దృష్టికి చేరింది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా హీరో వివేక్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి చలానా విధించారు.

అంతేకాకుండా కరోనా సమయంలో మాస్క్‌ ధరించనందున ఎఫైఐఆర్‌ నమోదు చేశారు. మహారాష్ట్రలోగత కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తుండంతో అధికారులు నిబంధనలను కఠినతరం చేశారు. మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనల్ని పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వివేక్‌ చివరగా ప్రధానమంత్రి మోదీ బయోపిక్‌లో కనిపించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. 

చదవండి : (వివేక్‌ ఒబెరాయ్‌ భార్యకు నోటీసులు!)
             (‘దిశా.. యమ హాట్‌గా ఉన్నావ్‌’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement