
సేఫ్టీ రైడ్
ప్రజల్లో సురక్షితంగా బైక్ రైడింగ్ చేయాలనే అవగాహన కలిగిస్తూ సాగుతున్న ‘బైక్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా- నేషనల్ సేఫ్టీ రైడ్’ బుధవారం నగరానికి చేరుకుంది. గత నెల 31న ఢిల్లీలో ప్రారంభమైన ఈ రైడ్ ఇప్పటి వరకు నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించింది. రుతి స్పోర్ట్స్‌తో కలిసి ఈ మెగా అవేర్‌నెస్ రైడింగ్‌ను చేపట్టారు. ఈ టీమ్‌లోని మొత్తం 9 మంది సభ్యుల్లో ముగ్గురు మహిళలే కావడం విశేషం. జైపూర్, అజ్మీర్, ముంబై, సూరత్, పూనె, అహ్మాదాబాద్, కొచి, బెంగళూరు తదితర నగరాలను చుట్టివచ్చిన టీమ్‌కు సిటీలో ఘన స్వాగతం లభించింది. ఇక్కడ నుంచి కోల్‌కతా వైపునకు దూసుకుపోయింది.