‘మేఘాలలో తేలిపొమ్మన్నది.. తూఫానులా రేగిపొమ్మన్నది.. అబ్బాయితో సాగుతూ చిలిపి మదీ’ అంటూ మార్చేసి పాడేసే టైమ్ వచ్చేసింది. ఒకప్పుడు కింగ్స్‌కి మాత్రమే పరిమితమైన బైకింగ్ ఇప్పుడు క్వీన్స్‌కి కిరీటాలు అలంకరించేస్తోంది. ఈ క్రమంలో నగరానికి చెందిన నలుగురు మహిళల బృందం కూడా ఒక రేర్ రైడ్‌తో సిటీలో టాక్ ఆఫ్ ద బైకింగ్ క్లబ్‌గా మారారు.
సొంత బైక్‌లపై పలు ప్రాంతాలను చుట్టేస్తూ..
ప్రపంచంలోనే ఎత్తైన రోడ్లపై ప్రయాణం
లఢాక్‌లోని ఉమ్లింగ్లా పాస్లో సాహస యాత్ర
విభిన్న రంగాలకు చెందిన మహిళల్ని ఒకే బాట పట్టిస్తోంది బైక్ రైడింగ్. అలా వేర్వేరు రంగాలకు చెందిన నలుగురు నగర మహిళలు బైకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో తాజాగా లఢాక్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఉమ్లింగ్లా పాస్‌ను అధిరోహించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ వారిని పలకరించినప్పుడు తమ రైడింగ్ అనుభవాలు పంచుకున్నారు.. ఆ వివరాలు...
సొంతంగా కొనుక్కున్న బైక్‌తో..
జూబ్లీíß గత కొంత కాలంగా బైక్ రైడింగ్ అలవాటైంది. మన ఇంట్రెస్ట్ కోసం పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టకూడదని గూగుల్లో పనిచేసి, ఆన్‌లైన్ బిజినెస్.. ద్వారా రూ.1.50 లక్షలు సంపాదించి సొంతంగా యమహా ఆర్15 వి2 బైక్ కొన్నాను. గతంలో షార్ట్ రైడ్స్‌కి కొన్నిసార్లు వెళ్లాను. అయితే బైకర్ణీలో చేరాక లాంగ్ రైడ్స్ మీద ఆసక్తి బాగా పెరిగింది. ఉమింగ్లా పాస్ రైడ్ అనుకున్నప్పుడు గతంలో ఎన్నడూ అంత లాంగ్‌వ్‌కి వెళ్లకపోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో అనే భయం ఉండేది. కానీ.. గ్రూప్‌లో వెళ్లాం కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప పెద్దగా ఏమీ ఫేస్ చేయలేదు. మైనస్ డిగ్రీస్ చలిలో మా టార్గెట్ రీచ్ అవడం అద్భుతమైన థ్రిల్లింగ్ ఇచ్చింది.
– గీతిక పోలిశెట్టి (28), ఫ్యాషన్ డిజైనర్
బైక్ రైడింగ్ ఇష్టం..
మేం ఎల్బీనగర్ లో ఉంటాం. చిన్నప్పటి నుంచీ బైక్ రైడింగ్ ఇష్టం. మా తాతయ్యకు లూనా ఉండేది. నేను వెనక ఎక్కేదాన్ని. ఆ తర్వాత మా నాన్నకి హోండా సీడీ 100 ఉండేది. ఆ బైక్ నేను డ్రైవ్ చేశాను. అందుకే నేను వాడిన నా ఫస్ట్ బైక్ జావా 42.. ఇప్పుడు బీఎండబ్ల్యూ జి3 10ఆర్ ఉంది. దీన్ని కేవలం లాంగ్ రైడ్స్‌కి వినియోగిస్తుంటాను. కర్ణాటక, హైదరాబాద్ టూ కన్యాకుమారి.. ఇలా టూర్స్ వెళ్లొచ్చాను. తొలి దశలో ఇంట్లో వాళ్లు కొంచెం భయపడ్డారు కానీ..ఇప్పుడు ఫుల్ కాని్ఫడెంట్‌గా ఉన్నారు. వీలైనంత వరకూ బైక్ రైడ్ ద్వారా మంచి మంచి ప్రదేశాలు చుట్టిరావాలని ఆశిస్తున్నాను. దీని తర్వాత నేపాల్, టిబెట్ రైడ్ కి వెళ్లాలనేది ప్లాన్..
–సుష్మితారెడ్డి (27), బిజినెస్ ఎనలిస్ట్
డ్రీమ్ రైడ్ అదే..
మేం మోకిలాలో నివసిస్తున్నాం. మొదట నేను యమహా ఆర్‌ఎక్స్ 100 నడిపేదాన్ని. ఆ తర్వాత నా సొంత బైక్ అంటే బెనల్లీ టీఎన్‌టీ 25, ప్రస్తుతం బీఎండబ్ల్యూ జి310ఆర్ నడిపిస్తున్నాను. ఏడేళ్లలో సిక్కిం, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలకు వెళ్లాం. ఎన్ని లాంగ్ రైడ్స్ వేసినా ఉమింగ్లా పాస్‌కు రైడ్ అనేది ఒక మరచిపోలేని అనుభూతిని అందించింది. మైనస్ డిగ్రీల వాతావరణం అలవాటు లేక కొంత ఇబ్బంది పడ్డాం. బైక్ స్కిడ్ అయి పడిపోవడం.. వంటి కొన్ని సంఘటనలు జరిగాయి. అయితే థాంక్ ఫుల్లీ.. ఎవరికీ ఏమీ కాలేదు. టిబెట్, భూటాన్, వియత్నాం.. రూట్ కవర్ చేయాలనేది డ్రీమ్ రైడ్. – సుష్మారెడ్డి (42), బిజినెస్ ఎనలిస్ట్
ఫిజికల్లీ ఫిట్..
మేం నేరేడ్ మెట్లో ఉంటాం. డిగ్రీ పూర్తి చేశాక 2017లో రైడింగ్ స్టార్ట్ చేశాను. మా నాన్నగారి ఓల్డ్ మోడల్ ఎలక్ట్రా 350 (రాయల్ ఎన్‌ఫీల్డ్) నడిపేదాన్ని. ఆ తర్వాత నా సొంతంగా థండర్‌బోల్ట్ 350ఎస్ కొనుక్కున్నా. తొలిరైడ్ 1700 కి.మీ నడిపించాను. వేల కిమీ లాంగ్ రైడ్స్ చేశాను. ఒక మహిళా రైడర్‌గా నాకున్న పరిధులు, పరిమితుల ప్రకారం.. పూర్తి ప్రణాళికా బద్ధంగా రైడ్స్‌కి వెళ్తుంటాను. ఎక్కడికి వెళ్లినా సాయంత్రం లోపు రైడ్ కంప్లీట్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటాను. అలాగే ఒక ఫిట్నెస్ ఫ్రీక్‌గా బైక్ పడినా సులభంగా లేపగలిగినæ ఫిట్నెస్ ఉండాలి. అందుకే లేహ్ లడక్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వచ్చే అల్టిట్యూడ్ మౌంటైన్ సిక్‌నెస్ రాలేదంటే...అందుకు కారణం నేను అనుసరించే సీరియస్ ఫిట్నెస్ రొటీన్ అని చెప్పగలను. –అనీషా ఫాతిమా లతీఫ్ (28), వృత్తి జిమ్ యజమాని
Comments
Please login to add a commentAdd a comment