అనువైన ప్రాంతంగా గుర్తించిన సైంటిస్టులు
ఉపగ్రహ ఆధారిత క్వాంటమ్ సమాచార ప్రసారాల సాంకేతికతపై భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కమ్యూనికేషన్లలో అత్యధిక నాణ్యత, భద్రత కోసం క్వాంటమ్ టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయించించింది. సంప్రదాయ శాటిలైల్ కమ్యూనికేషన్ల కంటే శాటిలైట్ ఆధారిత క్వాంటమ్ కమ్యూనికేషన్లు విశిష్టమైనవి. సంప్రదాయ విధానాల్లో అయితే మెగాహెర్ట్జ్(ఎంహెచ్‌జెడ్), గిగాహెర్ట్జ్(జీహెచ్‌జెడ్) ఫ్రీక్వెన్సీల్లో సమాచార మార్పిడి జరుగుతుంది.
క్వాంటమ్ కమ్యూనికేషన్లలో మాత్రం టెరాహెర్ట్జ్(టీహెచ్‌జెడ్) ఫ్రీక్వెన్సీ ఉపయోగిస్తారు. దీంతో డేటా మార్పిడి సామర్థ్యం ఎన్నో రెట్లు పెరుగుతుంది. క్వాంటమ్ ప్రసారాల రంగంలో తదుపరి పరిశోధనలకు గాను గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు కోసం రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఆర్‌ఆర్‌ఐ) సైంటిస్టులు అన్వేషణ ప్రారంభించారు. అడ్వాన్స్‌డ్ అబ్జర్వేటరీ కేంద్రాలైన లద్దాఖ్‌లోని హన్లే గ్రామంలో ఉన్న ఇండియన్ ఆ్రస్టానామికల్ అబ్జర్వేటరీ(ఐఏఓ), రాజస్తాన్‌లోని మౌంట్ అబూ అబ్జర్వేటరీ, నైనిటాల్‌లోని ఆర్యభట్ట ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్(ఏఆర్‌ఐఈఎస్)ను పరిశీలించారు.
ఆయా కేంద్రాల్లోని ఓపెన్–సోర్స్ డేటాను విశ్లేషించారు. క్వాంటమ్ సంకేతాలను అంతరిక్షంలోకి పంపించడానికి హన్లేలోని ఇండియన్ ఆ్రస్టానామికల్ అబ్జర్వేటరీ సరిగ్గా సరిపోతుందని తేల్చారు. ఇక్కడే ఎర్త్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హన్లే గ్రామం సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న ఎడారి ప్రాంతం. ఇక్కడ పొడి వాతావరణం ఉంటుంది. నీరు ఆవిరయ్యే రేటు తక్కువ. క్వాంటమ్ టెక్నాలజీపై పరిశోధనలకు ఈ ప్రాంతం చాలా అనువుగా ఉంటుందని గుర్తించారు.
ప్రభావవంతమైన శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఏర్పాటుకు క్వాంటమ్ సంకేతాలను భూవాతావరణం గుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతరిక్షంలోకి పంపించడం అత్యంత కీలకం. అందుకు ఇండియన్ ఆ్రస్టానామికల్ అబ్జర్వేటరీ సరిగ్గా సరిపోతుందని సైంటిస్టులు చెబుతున్నారు. క్వాంటమ్ సిగ్నల్స్‌ను ప్రాథమికంగా క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థల్లో ఉపయోగిస్తారు. ఇందులో అత్యంత సూక్ష్మమైన ఫో టాన్లు, ఎల్రక్టాన్లు, అణువుల ద్వారా సమాచార మార్పిడి జరుగుతుంది కాబట్టి నాణ్యత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. డేటా సెక్యూరిటీ విషయంలో క్వాంటమ్ టెక్నాలజీ పాత్ర నానాటికీ పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నా రు. భవిష్యత్తులో అత్యాధునిక క్వాంటమ్ టెక్నా లజీ ప్రాజెక్టులకు ఇండియా కేంద్రస్థానంగా మా రుతుందని, ఇక్కడున్న భౌగోళిక వైవిధ్యమే అందుకు కారణమని చెబుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment