పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా వస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వ వహించగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – మాటలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ ఇటీవల వికారాబాద్ అడవుల్లో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వారం రోజుల్లో పెండింగ్‌లో ఉన్న పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది.
అయితే షూటింగ్ మధ్యలో రోడ్ పై ‘భీమ్లా నాయక్’ బైక్ రైడ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖాకీ యూనిఫాంలో పవన్ బుల్లెట్ నడుపుతున్న వీడియోను పవర్ స్టార్ అభిమానులు షేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుంటే.. రానా ఇందులో రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇద్దరు వ్యక్తుల ఇగోలు హర్ట్ అయినప్పుడు వారెలా రియాక్ట్ అయ్యారనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది.
👊⭐️🔥💕pic.twitter.com/tbNduyERPu
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 17, 2021
Comments
Please login to add a commentAdd a comment