రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా సిబ్బంది తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఇటాలియన్ డీజే ఒల్లీ ఎస్సే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే డీజే ఆరోపణలు అసత్యమని ఎయిర్ ఇండియా కొట్టిపారేసింది. సమయానికి పోలీసులు కూడా అందుబాటులో లేరని ఆరోపించిన డీజేకు విమానశ్రయ పోలీస్ స్టేషన్ అధికారి బదులిచ్చారు. ఆరోజంతా స్టేషన్‌లోనే ఉన్నానని, తమ అధికారులు చెప్పింది తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమెకు వివరించారు.