How Word Rodomontade Enter In English Dictionary What Does It Mean: రోడమాంటేడ్.. ఇంతకీ ఎవరీయన? మాటియో మారియా బొయార్డో రాసిన ఇటాలియన్ ఎపిక్ పోయెమ్ ‘ఒరియండో ఇనెమోరటో’ (ఇంగ్లీష్‌లో ఒరియండో ఇన్ లవ్)లోని ఒక క్యారెక్టర్ ఈ రోడమాంటేడ్. ఇతడు సార్జా రాజు. ఊచకోతల మాట ఎలా ఉన్నా కోతలు బాగానే కోసేవాడు. గ్రనడా రాకుమార్తెను మహా గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమె మాత్రం రాజుగారిని కాదని అతని ప్రత్యర్థితో పారిపోతుంది.
దీంతో ఆ ప్రేమికరాజు అహం దెబ్బతింటుంది. కోపంలో పొరపాటున ఆమెను చంపేస్తాడు. ఆ తరువాత పశ్చాత్తాపానికి గురవుతాడు. ఆమె జ్ఞాపకంగా ఒక వంతెన కడతాడు. ఈ వంతెన మీద నుంచి వెళ్లేవారు తప్పనిసరిగా ఆమెకు నివాళి అర్పించాలని ఆర్డర్ జారిచేస్తాడు. చంపడం ఎందుకు? ఈ వోవర్ యాక్షన్ ఎందుకు? అనేది తరువాత విషయంగానీ... ఇతడి పేరు ఆంగ్ల నిఘంటువుల్లోకి దూరిపోయింది. తమకు తాము గొప్పలు చెప్పుకునేవారిని ‘రోడమాంటేడ్‌లా ప్రవర్తించకు’ అనడం పరిపాటి అయింది.
చదవండి: Health Tips: కాలీఫ్లవర్ తింటే ఇన్ని ఉపయోగాలా.. బోర్ కొడితే ఇలా ట్రై చేయండి!
Shraddha Parekh: చేతిని గట్టిగా పట్టుకుంటే ఇంటర్నల్ బ్లీడింగ్.. ఎముకలు విరిగేవి.. 20 ఏళ్ల తర్వాత
Comments
Please login to add a commentAdd a comment