
జస్ట్ ఫ్రెండ్.. అంతే!
ప్రేమా లేదు... పాడూ లేదు... మీరు ఏవేవో ఊహించుకోవద్దని శ్రుతీహాసన్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ మధ్య శ్రుతీతో సన్నిహితంగా ఓ అబ్బాయి తిరుగుతున్నాడని, అతను ఆమె లవర్ అనీ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అసలు వివరాల్లోకి వెళితే... ఇటీవల విమానాశ్రయాల్లో శ్రుతీహాసన్‌తో తరచూ ఓ వ్యక్తి కనిపిస్తున్నాడు. రఫ్ అండ్ టఫ్‌స్టైలిష్ లుక్‌లో కనిపించే అతగాడి పేరు మైఖేల్ కోర్సేల్.
అతను లండన్‌లో సెటిల్ అయిన ఇటాలియన్. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. అందుకని, థియేటర్స్ ఆర్ట్స్‌లో ఓ కోర్స్ కూడా చేశాడు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన మైఖేల్‌తో శ్రుతీహాసన్ పీకల్లోతు ప్రేమలో మునిగిందనే వార్తలు షికారు చేశాయి. ప్రేమికుల రోజున ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారనే వార్త గుప్పుమంది. ఇవన్నీ నిజమేనా? అని శ్రుతీహాసన్‌ను తాజా ఇంటర్వూ్యలో ప్రశ్నించగా.. ‘‘అలాంటిదేమీ లేదు. మేం జస్ట్ ఫ్రెండ్స్. అంతే’’ అన్నారామె. ఒక్క ముక్కలో సమాధానం చెప్పిన శ్రుతీహాసన్ ప్రేమలో ఎప్పుడు పడతారో మాత్రం చెప్పలేదు.