విమానంలో ప్రయాణికుల వికృత ప్రవర్తనలకు సంబంధించన పలు ఘటల గురించి విన్నాం. ఇటీవలే సహ ప్రయాణకురాలిపై మూత్ర విసర్జన ఘటన మరువుకే మునుపే అదే తరహ ఘటనలు వరసగా వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడొక ప్రయాణికురాలు అంతకు మించి అన్నట్టుగా.. చాలా ఘోరంగా ప్రవర్తించింది. ఆమె చేసిన హంగామా...ఆ విమానంలోని సిబ్బందిని హడలెత్తించేలా వికృతంగా ప్రవర్తించింది. తనది కాని సీటులో కూర్చొన్నదే గాక సిబ్బందిని దుర్భాషలాడుతూ..వారిపైనే దాడికి దిగింది. ఈ ఘటన ముంబై ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే...విస్తారా అబుదాబి అనే ముంబై విమానంలో 45 ఏళ్ల ఇటాలియన్ ప్రయాణికురాలు నానా బీభత్సం సృష్టిచింది. ఆమె ఎకనామీ టిక్కెట్టు కొనుక్కుని బిజినెస్ సీటులో కూర్చొంటానని పట్టుబట్టింది. ఆ సీటు తనది కాదని విమాన సిబ్బంది చెప్పేందుకు యత్నించగా.. వారిని దుర్భాషలాడుతూ దాడికి దిగింది. ఆ సిబ్బందిలో ఒకర్నీ కొట్టి, మరొకరిపై ఉమ్మి వేసి భయానకంగా ప్రవర్తించింది. అక్కడితో ఆగక అర్థనగ్నంగా నడిచి ప్రయాణికులను, సిబ్బందిని భయబ్రాంతులకు లోను చేసింది.
దీంతో కెప్టెన్ ఆమె అనుచిత ప్రవర్తన దృష్ట్యా హెచ్చరిక కార్డ్‌ను జారీ చేసి ప్రయాణికురాలిని నిరోధించాలని నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగానే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి..సదరు ప్రయాణకురాలిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రౌండ్ సెక్యూరిటీ ఏజెన్సీలను అలర్ట్ చేశాడు. ఈ మేరకు భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
(చదవండి: 13 గంటలు గగన ప్రయాణం.. చివరికి ఊహించని ల్యాండింగ్.. ప్రయాణికుల షాక్)
Comments
Please login to add a commentAdd a comment