
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమాని అడగ్గానే జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. అయితే అతను ఇచ్చిన గిఫ్ట్ కంటే బాబర్ ఆజం తాను వేసుకున్న ఇన్నర్ వేర్‌ను చూసి ఫ్యాన్స్ ఖంగుతిన్నారు. సాధారణంగా పురుషులు బనియన్ లేదా ట్రక్ వేసుకోవడం చూస్తుంటాం. అయితే మహిళలు ధరించే బ్రాను పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ధరించడం ఆశ్చర్యపరిచింది.
నిజానికి బాబర్ ఆజం వేసుకున్నది స్పోర్ట్స్ బ్రా. ప్రస్తుతం ఈ స్పోర్ట్స్ బ్రా మార్కెట్‌లో ట్రెండింగ్ లిస్టులో ఉంది. స్పోర్ట్స్ బ్రా లాగా ఉండే దీనిని కంప్రెషన్ వెస్ట్ అని పిలుస్తారు. ఇది భుజాల మధ్య వెనుక భాగాన్ని ఫిట్‌గా ఉంచేందుకు వాడుతుంటారు. ఇది చాలా తేలికగా ఉంటుంది. ఇది ధరించిన వ్యక్తి కూడా దానిని గుర్తించలేనంత తేలికగా ఉంటుంది.
ఈ పరికరంలో GPS ట్రాకర్ ఉంటుంది. ఇది ప్లేయర్ తన రన్నింగ్ స్పీడ్‌ని లెక్కించుకునేందుకు వాడుతుంటారు. ఇందులో గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ ఉన్నాయి. ఇది ఆటగాళ్ల కదలికలను 3Dలో కొలుస్తూ.. వారి స్థానాలను ట్రాక్ చేస్తుంది. ఇందులో హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉంది.
దీని నుంచి అందుకున్న సమాచారంతో సెంట్రల్ డేటాబేస్ అనుసంధానిస్తుంటారు. ఇది విశ్లేషకులు పరిశీలన చేసి, ప్లేయర్ ఫిట్‌నెస్‌ను అంచనా వేస్తుంటారు. టీమిండియా ఆటగాళ్లు కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. 2018లో భారత కండిషనింగ్ కోచ్ శంకర్ బసు దీనిని టీమిండియాకు తీసుకువచ్చాడు.
ఇక పాకిస్తాన్ జట్టు ఇటీవలే శ్రీలంకలో పర్యటించిన సంగతి తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి లంకకు గట్టిషాక్ ఇచ్చింది. సిరీస్ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పాకిస్తాన్ టీమిండియాను రెండో స్థానంలోకి నెట్టేసింది. లంకతో సిరీస్ ముగిశాకా పాక్‌కు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ వరకు ఆ జట్టుకు విశ్రాంతి లభించినట్లే.
Babar Azam Gifted his Test Jersey to a Young Fan So Cute🇵🇰💯. #BabarAzam #NoChangeNeededPCB pic.twitter.com/KBMtBAYFcE
— Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) July 27, 2023
చదవండి: Major League Cricket 2023: 'ఫ్లైట్ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది.. మీ ఆజ్ఞ మహారాజా!'