చాంపియన్స్ కప్-2024లో పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజం నిలకడైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. తన బ్యాట్ పవర్ చూపిస్తూ మునుపటి బాబర్‌ను గుర్తుకుతెచ్చేలా ఆడుతున్నాడు. ఆదివారం నాటి మ్యాచ్‌లో అతడు ఒకే ఓవర్లో వరుసగా ఐదు ఫోర్లు బాదడం అభిమానులకు ముచ్చటగొలిపింది.
కాగా జాతీయ జట్టును పటిష్టం చేసే క్రమంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దేశవాళీ క్రికెట్‌లో కొత్తగా మూడు టోర్నీలు ప్రవేశపెట్టింది. చాంపియన్స్ వన్డే కప్, చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్‌క్లాస్ కప్ పేరిట టోర్నమెంట్లు నిర్వహించాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా.. తొలుత చాంపియన్స్ వన్డే కప్ మొదలైంది.
చాంపియన్స్ వన్డే కప్‌లో ఐదు జట్లు
మార్ఖోర్స్, స్టాలియన్స్, పాంథర్స్, డాల్ఫిన్స్, లయన్స్ పేరిట ఐదు జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. ఇక జాతీయ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం ఇందులో స్టాలియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో తొలుత... లయన్స్‌తో మ్యాచ్‌లో 79 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టాలియన్స్.. లయన్స్‌ను ఏకంగా 133 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇందులో బాబర్‌దే కీలక పాత్ర.
తాజాగా.. మార్ఖోర్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 45 పరుగులతో రాణించాడు. స్టాలియన్స్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో.. పేసర్ షానవాజ్ దహానీ బౌలింగ్ చేయగా.. బాబర్ ఆజం అతడికి చుక్కలు చూపించాడు. 4,4,4,4,4 బాది.. 20 పరుగులు పిండుకున్నాడు.
అంత ఈజీగా ఎలా కొట్టేశాడు!
ఇందుకు సంబంధించిన వీడియోను షానవాజ్ షేర్ చేస్తూ.. ‘‘ఈ దృశ్యాలను మీరు మళ్లీ మళ్లీ చూడటం ఖాయం. ఈరోజు రాత్రి నేను నిద్రపోయే ప్రసక్తే లేదు. అయినా.. బాబర్ అంత సులువుగా పరుగులు ఎలా రాబట్టాడో నాకు అర్థం కావడం లేదు’’ అంటూ ప్రత్యర్థి బ్యాటర్‌ను ప్రశంసించడం విశేషం.
సూపర్ ఫామ్‌ను అందుకోవాలి
అయితే, ఈ మ్యాచ్‌లో స్టాలియన్స్‌ను గెలిపించేందుకు బాబర్ మెరుపులు సరిపోలేదు. మార్ఖోర్స్ స్టార్లు ఇఫ్తికర్ అహ్మద్(60), సల్మాన్ ఆఘా(51) హాఫ్ సెంచరీలతో రాణించి తమ జట్టుకు విజయం అందించారు. ఏదేమైనా బాబర్ ఆజం తిరిగి ఫామ్‌లోకి రావడం పాకిస్తాన్ జట్టుకు శుభసూచకమని అభిమానులు మురిసిపోతున్నారు. ఈ దేశవాళీ టోర్నీలో సత్తా చాటి.. ఈ వరల్డ్ నంబర్ వన్ మునుపటి సూపర్ ఫామ్‌ను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో పేలవ ప్రదర్శనతో అటు కెప్టెన్‌గా... ఇటు బ్యాటర్‌గా బాబర్ ఆజం దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో ముగిసిన టెస్టు సిరీస్‌లోనూ తన మార్కు చూపించలేకపోయాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి కేవలం 64 పరుగులు సాధించాడు.
చదవండి: నీరజ్ చోప్రా భావోద్వేగం.. స్పందించిన మనూ భాకర్
4, 4, 4, 4, 4 by Babar Azam against Shahnawaz Dahani 🔥#ChampionsCup | #PakistanCricketpic.twitter.com/hxZq7uXpks
— Grassroots Cricket (@grassrootscric) September 15, 2024
Comments
Please login to add a commentAdd a comment