వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ మరో వివాదానికి తెరతీశారు. కృత్రిమ గర్భధారణ(ఐవీఎఫ్)కు తాను తండ్రి లాంటివాడినని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)ను ఉచితం చేస్తానని ప్రకటించారు. తాజాగా జార్జియాలో ఫాక్స్ న్యూస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కృత్రిమ గర్భధారణకు తమ పార్టీ పూర్తి అనుకూలమని స్పష్టంచేశారు. ఈ విషయంలో డెమొక్రటిక్ పార్టీ నేతలు తమపై మాటల దాడి చేస్తారని తెలిసినప్పటికీ ఐవీఎఫ్‌కు మద్దతు ఇస్తూనే ఉంటామని అన్నారు.
కొన్ని రాష్ట్రాల్లో గర్భవిచ్చిత్తి చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని, వాటిని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. అబార్షన్ హక్కులను రాష్ట్రాలకే వదిలేయాలన్నది తన విధానమని స్పష్టంచేశారు. అత్యాచారం వల్ల గర్భం దాలిస్తే, గర్భం దాలి్చన తల్లి ప్రాణానికి ముప్పు ఉంటే గర్భవిచ్చిత్తికి అనుమతి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. అయితే, ఉచిత ఐవీఎఫ్ పథకానికి నిధులు ఎలా సమకూరుస్తారో ట్రంప్ వెల్లడించలేదు. అలాగే చట్టపరమైన ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటారని తెలియజేయలేదు. ఐవీఎఫ్ తండ్రిని అంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తప్పుపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment