ఐవీఎఫ్‌ ట్రీట్‌మెంట్‌పై కేంద్రం ఫైర్‌! | Centre Seeks Report On Sidhu Moosewalas Mothers IVF | Sakshi
Sakshi News home page

ఐవీఎఫ్‌ ట్రీట్‌మెంట్‌పై కేంద్రం ఫైర్‌! సిద్దూ మూసేవాలా తల్లి ఐవీఎఫ్‌పై ఆరా!

Published Wed, Mar 20 2024 2:34 PM | Last Updated on Wed, Mar 20 2024 4:06 PM

Centre Seeks Report On Sidhu Moosewalas Mothers IVF - Sakshi

పంజాబ్‌ ర్యాపర్‌, దివంగత సింగర్‌ సిద్దు మూసేవాలా 2022లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఒక్కగానొక్క కొడుకు మరణం జీర్ణించుకోలేని సిద్దు తల్లిదండ్రులు తమ కొడుకును మళ్లీ చూసుకోవాలని ఆరాటపడ్డారు. ఈ క్రమంలోనే సిద్దూ మూసేవాలే తల్లిదండ్రులు మరోసారి అమ్మనాన్నలయ్యారు. సిద్దూ  బల్కౌర్‌ సింగ్‌ తండ్రి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. తమకు ఒక బాబు పుట్టాడని, తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు కూడా పేర్కొన్నారు.

అయితే ఇక్కడ సిద్దూ  తల్లి 58 ఏళ్ల చరణ్ సింగ్ ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) టెక్నిక్ ద్వారా బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఇప్పుడూ ఈ అంశం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వయసులో పిల్లలను కనడం కరెక్టేనా అని ప్రశ్న లేవనెత్తింది.  నిజానికి ఇలా ఐవీఎఫ్‌​ ద్వారా బిడ్డను కనడానికి గల వయో పరిమితిపై ఆరా తీసింది. అంతేగాదు సిద్దు మూస్ వాలా తల్లి చరణ్ సింగ్‌క ఐవీఎఫ్‌ చికిత్సపై కూడా నివేదిక ఇమ్మని పంజాబ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.  అలాగే  అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్, 2021లోని సెక్షన్ 21(జీ)(i) ప్రకారం..21 నుంచి 50 ఏళ్లలోపు వయోపరిమితి ఉన్నవాళ్లు మాత్రమే ఐవీఎఫ్‌ ద్వారా బిడ్డకి జన్మనివ్వడం సురక్షితం అని స్పష్టం చేసింది. 

ఈ క్రమంలోనే పంజాబ్‌ ప్రభుత్వం సిద్దూ మూసే వాలే తండ్రిని శిశువుకి సంబంధించిన పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో సిద్దూ తండ్రి బల్కౌర్ సింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో.." జిల్లా అధికారులు నన్ను వేధిస్తున్నారు. చిన్నారికి సంబంధించిన  డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేశాను. అయినా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యమంత్రి, అధికారులు జోక్యం చేసుకోవాలి. ట్రీట్‌మెంట్ జరిగేంత వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. కావాల్సినప్పుడల్లా నేను అందుబాటులోనే ఉంటాను. లీగల్ డాక్యుమెంట్స్‌ని కచ్చితంగా సబ్మిట్ చేస్తాను"

(చదవండి: దిగ్గజ ర్యాపర్‌ మళ్లీ పుట్టాడు.. 58 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement