ఇంకేం కావాలి... ఇంకేం కావాలి | aishwarya rai in isha ambani wedding in sajjam goat | Sakshi
Sakshi News home page

ఇంకేం కావాలి... ఇంకేం కావాలి

Published Mon, Dec 17 2018 1:00 AM | Last Updated on Mon, Dec 17 2018 4:56 AM

aishwarya rai in isha ambani wedding in sajjam goat - Sakshi

అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌

... అని కొసరి కొసరి వడ్డిస్తాం ఇంటికొచ్చిన అతిథులకు. అలాగే చేశారు బాలీవుడ్‌ బెస్ట్‌ కపుల్స్‌లో ఒకరైన ఐశ్వర్యారాయ్‌ అండ్‌ అభిషేక్‌ బచ్చన్‌. మరి.. బచ్చన్‌ ఇంటికి వచ్చిన ఆ అతిథి ఎవరై ఉంటారా? అనే ఊహలకు అర్జెంట్‌గా ఫుల్‌స్టాప్‌ పెట్టండి. ఎందుకంటే వీరిద్దరూ వడ్డించింది అంబానీ ఇంటి వేడుకలో. ఇషా అంబానీ, ఆనంద్‌ పిరమాల్‌ వెడ్డింగ్‌లో. ఓన్లీ అభిషేక్, ఐష్‌నే కాదు అమితాబ్, ఆమిర్‌ కూడా ఈ పెళ్లిలో వడ్డించారని బాలీవుడ్‌ సమాచారం. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

పెళ్లి కూతురు తరఫువాళ్లు పెళ్లి కొడుకు వాళ్లకు వడ్డించాలనే సంప్రదాయ మట ఇది. దీనిని ‘సజ్జన్‌ గోట్‌’ అని పిలుస్తారట. ఇషా–ఆనంద్‌ పెళ్లి వేడుకలకు అందరికంటే ముందే వచ్చారట బచ్చన్‌ ఫ్యామిలీ. ఆ తర్వాత ఒక్కొక్కరుగా బాలీవుడ్‌ సినీ సెలబ్రిటీలందరూ అక్కడికి చేరుకున్నారు. ఐశ్వర్యారాయ్, కరిష్మా కపూర్‌ కలిసి ఓ సాంగ్‌కు చిందేశారట. అలాగే అభిషేక్‌–ఐశ్వర్య వారిద్దరూ కలిసి నటించిన ‘గురు’లోని ‘తేరే బినా...’ సాంగ్‌కు డ్యాన్స్‌ చేయడం ఓ హైలైట్‌ అట. ఈ సంగతి అలా ఉంచితే... ఐష్, అభిషేక్‌ జంటగా ‘గులాబ్‌ జామున్‌’ అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ  చిత్రం షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement