
Shein India: అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' గురించి అందరికి తెలుసు. వ్యాపార రంగంలో తండ్రికి తగ్గ తనయురాలిగా పేరు తెచ్చుకున్న ఈమె త్వరలో భారతదేశానికి చైనీస్ ఫ్యాషన్ బ్రాండ్ 'షీన్' (Shein) తీసుకురావడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సుమారు మూడేళ్ల తర్వాత షీన్‌ను ఇండియాకు తీసుకురావడానికి ఇషా అంబానీ సిద్ధమైంది. ఇండియాకు తిరిగి రావడానికి షీన్ రిలయన్స్ రిటైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సరసమైన ధరలో ట్రెండింగ్ అండ్ స్టైలిష్ దుస్తుల కోసం చూస్తున్న మహిళలకు షీన్ ఒక మంచి షాపింగ్ ప్లాట్‌ఫారమ్. ఈ బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందగలిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2020 జూన్‌లో ఈ కంపెనీ భారతదేశంలో నిషేధానికి గురైంది. అయితే సుదీర్ఘ సమయం తరువాత మళ్ళీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది.
2020లో నిషేదానికి గురైన సమయంలో కూడా బ్రాండ్ ప్రోడక్ట్స్ ఢిల్లీ వంటి ప్రముఖ నగరాల్లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ద్వారా ఢిల్లీ కోర్టు నోటీస్ జారీ చేసే వరకు అమ్ముడవుతూనే ఉన్నాయి. నిజానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో షీన్ బ్రాండ్ ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఒకదానితో ఒకటి ప్రయోజనం పొందుతాయి.
(ఇదీ చదవండి: ఈ చెట్ల పెంపకం మీ జీవితాన్ని మార్చేస్తుంది - రూ. కోట్లలో ఆదాయం పొందవచ్చు!)
రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంలో ఇప్పటికే జిమ్నీ చూ, జార్జియా అర్మానీ, హ్యూగో బాస్, వెర్సస్, మైఖేల్ కోర్స్, బ్రూక్స్ బ్రదర్స్, అర్మానీ ఎక్స్చేంజ్, బర్బెర్రీ వంటి బ్రాండ్స్ ఉన్నాయి. ఈ జాబితాలో షీన్ కూడా త్వరలోనే చేరే సూచనలు కనిపిస్తున్నాయి. 2022లో రిలయన్స్ రిటైల్‌కు కొత్త లీడర్‌గా ఎంపికయ్యే సమయాన్ని బ్రాండ్ నికర విలువ రూ. 2కోట్లు, అయితే ఇప్పుడు బ్రాండ్ విలువ ఏకంగా రూ. 4 కోట్లకు చేరింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.
Comments
Please login to add a commentAdd a comment