రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో భాగంగా ఉన్న టీరా బ్యూటీకేర్ కృత్రిమ మేధను వాడుతున్నట్లు కంపెనీ మార్కెటింగ్ హెడ్ తేజస్ కపాడియా తెలిపారు. తమ కస్టమర్లను మరింత అందంగా మార్చేందుకు కంపెనీ కొత్త టెక్నాలజీని పరిచయం చేసిందని చెప్పారు.
ఈ సందర్భంగా కపాడియా మాట్లాడుతూ..‘ఆర్‌ఐఎల్ కొత్త వెంచర్ తిరా బ్యూటీ సెక్టార్‌లో వినియోగదారులకు సేవలందిస్తోంది. ఈ రంగంలో ఇప్పటికే ఉన్న పోటీదారులకంటే ప్రత్యేకంగా కస్టమర్లను ఆకర్షించేందుకు టెక్నాలజీను వాడుతున్నాం. వినియోగదారుల స్కిన్‌టోన్‌ను ఫొటోతీసి వారికి కావాల్సిన బ్యూటీ ప్రొడక్ట్‌లను సిఫార్సు చేసేలా ఏఐను ఏర్పాటుచేశాం. ఇందులో స్కిన్‌ఎనలైజర్ టెక్నాలజీ ఉపయోగించాం. దీని సహాయంతో తమకు ఇష్టమైన ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు. కంపెనీ వెబ్‌సైట్‌లో మేకప్, చర్మ సంరక్షణ పాఠాలను కూడా అందిస్తున్నాం’ అని చెప్పారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారాల్లో బ్యూటీ సెక్టార్ ఒకటి. ఇందులో రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీ ప్రవేశించడంతో చాలా కంపెనీల ఉత్పత్తులపై ప్రభావంపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖేశ్‌అంబానీ కుమార్తె ఇషా నేతృత్వంలోని టీరా కంపెనీ ఇప్పటికే స్కిన్‌కేర్ బ్రాండ్ కికో మిలానో, ఎల్‌బీఎంహెచ్ గ్రూప్‌నకు చెందిన బ్యూటీ రిటైలర్ సెఫోరాను కొనుగోలు చేసింది. ఈ కంపెనీ రాకతో ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న టాటా గ్రూప్‌నకు చెందిన పాలెట్, నైకా వంటి బ్రాండ్‌లపై ప్రభావం ఉండనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదీ చదవండి: బంగారుకొండను పేరుస్తున్న ఆర్‌బీఐ..!
భారత్‌లో ఈ బిజినెస్‌కు భవిష్యత్తులో ఆశించిన మార్కెట్ ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లు కూడా దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. 2023లో జపాన్‌కు చెందిన షిసిడో యాజమాన్యంలోని ‘నార్స్ కాస్మెటిక్’ షాపర్స్ స్టాప్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది పాప్‌స్టార్ రిహన్న తన కాస్మెటిక్స్ కంపెనీ ఫెంటీ బ్యూటీ ఉత్పత్తులను నైకాతో కలిసి భారత్‌లో ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment