ఇషా అంబానీ నిర్వహించిన రోమన్ హోలీ ఈవెంట్‌లో కాబోయే మరదలు రాదికా మర్చంట్ శాటిన్ డ్రెస్‌లో ఆకర్షించింది. అందానికి తగ్గ స్టెయిలష్ బ్రాండ్‌లతో మరింత అందంగా కనిపించే రాధికా ఈ డ్రస్‌లో సినీ సెలబ్రెటీలను తలదన్నేలా కనిపించింది. కాక్‌టెయిల్ పార్టీలకు కరెక్ట్‌గా సరిపోయే డ్రస్‌లో అదిరిపోయింది. అందరి అటెన్షన్ ఆమె ధరించే డ్రస్‌పైనే పడింది. ఈ వేడుకలో ప్రముఖ సెలబ్రెటీలు, బాలీవుడ్ సినీ తారలు తమదైన స్టైయిలిష్ డిజైన్ వేర్‌లు, ఆభరణాలతో సందడి చేశారు.
ఇందులో ఇషా అంబానీ గౌను డిజైనింగ్‌కే 100 గంటలు పట్టగా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన చీరతో స్టన్నింగ్ లుక్‌తో కనిపించింది. ఇక ఈ వేడుకలో రాధిక ధరించిన శాటిన్ డ్రెస్ ధర ఏకంగా రూ. 6.4 లక్షలు పలుకుతుందట. రాధిక ఆ డ్రెస్‌కి తగ్గట్టుగా అత్యంత లగ్జరియస్ ఆభరణాలను కూడా ధరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీలకు కాబోయే కోడలకు తగ్గ రేంజ్‌లో ఆమె డ్రస్ ధర ఉంది.
అలాగే ఆమె నెక్‌కు ధరించిన నయీమ్ ఖాన్ గోల్డ్ ఆర్మీరీ జోడియాక్ క్లచ్ ధర ఏకంగా రూ. 1.67 లక్షలు. అంతేగాదు ఆమె ఇటీవల జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా బంగారంతో డిజైన్ చేసిన లెహంగాతో అందర్నీ మంత్రముగ్ధులన్ని చేసిన సంగతి తెలిసిందే. ఆమె అందానికి తగ్గ సింపుల్ డిజైనింగ్ వేర్‌లతో అందర్నీ కట్టిపడేసే ఆకర్షణీయమైన అందం రాధిక సొంతం.
Comments
Please login to add a commentAdd a comment