డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జియో ఫైనాన్షియల్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ముఖేష్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రీటైల్ డైరెక్టర్ ఈషా అంబానీనీ నియమించినట్లు తెలుస్తోంది.
రిలయన్స్‌లో ఇండస్ట్రీస్ (RIL)లో జియో ఫైనాన్షియల్ ఓ భాగం. అయితే, ఆర్‌ఐఎల్ నుంచి జియో ఫైనాన్షియల్‌ను డీ మెర్జర్ (విడదీయడం) చేసింది. ఇందుకోసం ఎన్‌సీఎల్‌టీ ఆమోదం కూడా పొందింది. డీ మెర్జర్ తర్వాత జియో ‘ఫైనాన్సియల్ సర్వీసెస్ (Jio Financial Services- JFSL) పేరిట స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కోసం ఐపీఓకు వెళనున్నట్లు సమాచారం.
ఈ తరుణంలో శుక్రవారం జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ముఖేష్ అంబానీ తన గారాల పట్టి ఈషా అంబానీకి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈషా అంబానీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతల్ని అప్పగించారు. మెక్ లారెన్స్ స్ట్రాటర్జిక్ వెంచర్స్ కు చెందిన హితేష్ సెథియాను మూడేండ్ల పాటు జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ సీఈవో, ఎండీగా విధులు నిర్వహించనున్నారు.
యేలే యూనివర్సిటీ డిగ్రీలో ఎకనామిక్స్, ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే పూర్తి చేసిన ఈషా అంబానీ రిలయన్స్ రీటైల్, జియో ఫ్లాట్‌ఫామ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా, డిజిటల్ లెండింగ్, ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్మెంట్ వంటి సేవల్ని అందించే జియో ఫైనాన్షియల్ సంస్థ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తన తండ్రి ముఖేష్ అంబానీ తరహాలో తన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
చదవండి👉 టాటాలనే ఢీకొట్టేలా.. ఈషా అంబానీ మరో వ్యాపార ఎత్తుగడ!
Comments
Please login to add a commentAdd a comment