
అంబానీ వారసురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ మరో ఘనతను సొంతం చేసుకుంది. బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా కుమార్తె, ఇషా అంబానీ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. ఈ సందర్భంగా తల్లినుద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేసింది. అలాగే తనకు దక్కిన అవార్డును తల్లి నీతాకు, తన కుమార్తె ఆదియాకు అంకితమివ్వడం విశేషంగా నిలిచింది. దీంతో ప్రస్తుతం ఇషా గూగుల్ ట్రెండింగ్‌లో నిలిచింది.
హార్పర్స్ బజార్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ 2024లో 'ఐకాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ఇషా అందుకుంది. ఈ అవార్డును ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్, వ్యవస్థాపకురాలు గౌరీఖాన్ ఆమెకు అందించారు. అవార్డు అందుకున్న తర్వాత, ఇషా తన తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ హార్ట్ టచింగ్ ప్రసంగం చేసింది.
‘‘నా విజయానికి బాటలు వేసిన నా తల్లి, నా రోల్ మోడల్" అంటూ తల్లి నీతాకు ధన్యవాదాలు తెలిపింది ఇషా. ‘అమ్మా, నీకు ధన్యవాదాలు, నీ నడకే నాకు పరుగులు నేర్పింది. ఇది నిజంగా నీ వల్లనే’.. అంటూ ప్రసంగించింది. ఈ ఘనత అంతా అమ్మకే దక్కుతుంది. అందుకే ఈ అవార్డు అమ్మకు అంకితం’’ అన్నారు. అంతేకాదు "ఈ అవార్డును నా కుమార్తె ఆదియాకు కూడా అంకితమిస్తున్నా..నా బిడ్డ ప్రతీ రోజూ నన్నెంతో ప్రోత్సహిస్తోంది’’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
రిలయన్స్ రిటైల్ డిజిటల్ ఉనికిని మెరుగుపరచడంలో ఇషా కీలక పాత్ర పోషించింది ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అజియో, ఆన్‌లైన్ బ్యూటీ మార్కెట్‌ప్లేస్ తీరా లాంటివాటితో వ్యాపారం రంగంలో దూసుకు పోతోంది. వ్యాపారవేత్త ఆనంద్ పిరమల్‌ను పెళ్లాడిని ఇషాకు కవల పిల్లలు.
ఇవీ చదవండి: హనీమూన్ డెస్టినేషన్ : పడవింట్లో విహారం!
కలల పంటకోసం ఎదురు చూపులు : అందమైన మెటర్నిటీ షూట్
Comments
Please login to add a commentAdd a comment