
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నీతాల చిన్న కుమారుడు పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో మొదటగా జరిగిన సంగీత్ కార్యక్రమం నీతా ధరించిన ఆభరణాలు, వస్త్రాధారణ హైలెట్‌గా నిలిచింది. ఇక తర్వాత జరుగుతున్న హల్దీ వేడుక చాల కలర్‌ఫుల్‌గా సాగింది. ఈ హల్దీ వేడుకలో ఇషా పిరమల్, శ్లోకా మెహతా రంగరంగుల లెహంగాలతో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకున్నారు.
ఈ వేడుకలో కాబోయే పెళ్లి కూతరు రాధిక ఆమె సోదరి సాంప్రదాయ వస్త్రధారణతో కళ్యాణ శోభను తీసుకొచ్చారు. ఈ గ్రాండ్ వేడుకలో శ్లోకా, అనామికా ఖన్నా డిజైనర్ వేర్ లెహంగాను ధరించింది. ఆమె ఎరుపు, నీలం, ఆకుపచ్చ, బంగారు రంగు వంటి మరెన్నో రంగులతో కూడిన శక్తివంతమైన లెహంగా సెట్‌ను ధరించింది. దానికి తగినట్టుగా చిలుక ఆకుపచ్చ స్కర్ట్ దానిపై పూల ఎంబ్రాయిడరీని అందంగా తీర్చిదిద్దారు.
ఇక ఇషా మల్టీకలర్ కలర్ లెహంగాను ధరించింది. ప్రముఖ లగ్జరీ బ్రాండ్ టోరాని దిల్ రంగ్ జీవా లెహంగా సెట్‌తో అలరించింది. ఇది ఇండో వెస్టట్రన్ టచ్‌తో కూడిన సరికొత్త డిజైనర్ వేర్ లెహంగా. దీనికి రా సిల్క్‌తో రూపొందించిన టాసెల్ అలంకారాలు హైలెట్‌గా ఉండగా, అందమైన నెక్‌లైన్‌తో కూడిన ప్రత్యేకమైన బ్లౌజ్ మరింత అకర్షణీయంగా ఉంది. ఈ లెహంగా ధర ఏకంగా రూ. 135,500/-.
(చదవండి: అనంత్ రాధిక సంగీత్ కార్యక్రమంలో నీతా లుక్ అదుర్స్..చేతికి హృదయాకారంలో..!)
Comments
Please login to add a commentAdd a comment