దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా నిలిచింది ముఖేష్ అంబానీ కూతురు పెళ్లి. ఈ నెల 12న ఇషా అంబానీ - ఆనంద్ పిరమాల్‌ల వివాహం అత్యతం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు దేశ, విదేశాల అతిథులే కాక బాలీవుడ్ తారాగణమంతా తరలి వెళ్లారు. పెళ్లి తంతు పూర్తయినప్పటికి ఈ రోజుకు కూడా ఇషా వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇషా అంబానీ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.
బాలీవుడ్ సూపర్ స్టార్, ‘బిగ్ బీ’ అమితాబ్ బచ్చన్, ‘మిస్టర్ పర్ఫేక్షనిస్ట్’ ఆమిర్ ఖాన్ ఇషా అంబానీ వివాహానికి వచ్చిన అతిథులకు స్వయంగా తమ చేతులతో వడ్డించారు. సంప్రదాయ గుజరాతీ వంటకమైన ఢోక్లాలను అతిథులకు వడ్డించి.. అంబానీ కుటుంబంతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాక అమితాబ్ కన్యాదాన సమయంలో బ్రాహ్మణునికి బదులు తానే ఆ మంత్రాల అర్థాన్ని వివరిస్తూ కన్యాదానం గొప్పదనాన్ని వివరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment