
భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ వేడుకలు మార్చి 1 నుంచి మార్చి 3 వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకల్లో ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు.
ఈ శుభ సందర్భంలో ముందస్తు పెళ్లి వేడుకకు ముందు అనంత్ అంబానీ తన తోబుట్టువులు ఆకాష్, ఇషాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ముగ్గురి మధ్య పోటీ లేదని, తన తోబుట్టువులు తనకు సలహాదారులలాంటి వారని మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు.
‘మా మధ్య ఎలాంటి పోటీ లేదు. వారు నా సలహాదారుల లాంటి వారు. నేను వారి సలహాలను నా జీవితాంతం పాటించాలనుకుంటున్నాను. వారికి నేను హనుమంతుడి లెక్క. నా అన్న నా రాముడు. నా చెల్లెలు ఈశా నాకు తల్లితో సమానం. వాళ్ళిద్దరూ నన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉన్నారు. మా మధ్య ఎలాంటి విభేదాలు. పోటీలు లేవు. మేము కలిసిపోయాం. మాది ఫెవిక్విక్ బంధం’ అంటూ నవ్వేశారు.
తన తండ్రి ముఖేష్ అంబానీతో తనకున్న అనుబంధం గురించి అనంత్ మాట్లాడుతూ.. తన తండ్రి మార్గదర్శకత్వం లేనిది ఏదీ సాధించలేనని అన్నారు. మాకు ఆయనంటే ఎంతో గౌరవం. నా తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇవన్నీ నిర్మించగలుగుతున్నాను’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment