అనంత్‌ అంబానీ పెళ్లి వేడుకలో.. ప్రియురాలితో బిల్‌గేట్స్‌ చెట్టాపట్టాల్‌! | Bill Gates Attend Anant Ambani Pre-wedding Bash With Girlfriend Paula Hurd | Sakshi
Sakshi News home page

అనంత్‌ అంబానీ పెళ్లి వేడుకలో.. ప్రియురాలితో బిల్‌గేట్స్‌ చెట్టాపట్టాల్‌!

Published Sat, Mar 2 2024 11:50 AM | Last Updated on Sat, Mar 2 2024 1:46 PM

Bill Gates Attend Anant Ambani Pre-wedding Bash With Girlfriend Paula Hurd - Sakshi

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకల కోసం వ్యాపార, క్రీడా, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, మార్చి1న ప్రారంభమైన ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ తన ప్రియురాలు పౌలా హర్డ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అంబానీ, వరుడు అనంత్ అంబానీతో కలిసి పోజులిచ్చారు.

దీంతో బిల్‌గేట్స్‌- పౌలా హార్డ్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. పలు నివేదికల ప్రకారం..ఒరాకిల్‌ సంస్థ మాజీ సీఈఓ భార్య పౌలా హార్డ్‌ను బిల్‌గేట్స్‌ గాఢంగా ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే  గత ఏడాది అమెజాన్‌ అధినేత జెఫ్‌బెజోస్‌ ఎంగేజ్‌మెంట్‌లో ప్రత్యేక్షమయ్యారు.

 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఇద్దరూ కలిసి కనిపించడంతో బిల్ గేట్స్‌తో ఆమె సంబంధం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. వారిద్దరూ మార్చి 2022లో ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ డబ్ల్యూటీఏ సెమీఫైనల్ మ్యాచ్‌ని తిలకిస్తూ మీడియా కంట కనబడ్డారు. బిల్‌గేట్స్‌-పౌలాహర్డ్‌ స్నేహబంధం గురించి అడినప్పుడల్లా దాటవేస్తూ వచ్చారు. 

గత ఏడాది జూలైలో పౌలా హర్డ్ ధరించిన డైమండ్ రింగ్‌ ధరించి కనిపించడంపై వాళ్లిద్దరికి నిశ్చితార్థం జరిగినట్లు పుకార్లు వచ్చాయి. పీపుల్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్‌ ప్రతినిధి హర్డ్ దశాబ్దాలుగా ఆ ఉంగరాన్ని ధరిస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు.

 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై
2021లో బిల్‌గేట్స్‌..మిలిండా గేట్స్ 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై చెప్పారు. అదే ఏడాది తాము విడిపోతున్న‌ట్లు ప్రకటించారు. అనంతరం వాషింగ్ట‌న్‌లోని కింగ్ కౌంటీ కోర్టులో మిలిందా గేట్స్ విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 1987లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు స‌మ‌యంలో ఇద్ద‌రూ క‌లుసుకున్నారు. 1994లో వాళ్లిద్ద‌రు పెళ్లి చేసుకున్నారు. కేవ‌లం విడిపోయే అంశంలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌ ఆధారంగా డైవ‌ర్స్ తీసుకున్నట్లు ఆప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక, మిలిందా గేట్స్‌ నుంచి విడిపోయిన బిల్‌ గేట్స్‌ పౌలా హార్డ్‌తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement