Met Gala 2023 Priyanka Chopra Diamond Necklace Is Worth Rs 204 Crore - Sakshi
Sakshi News home page

మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్‌ ధర తెలిస్తే షాకవుతారు!

Published Tue, May 2 2023 1:56 PM | Last Updated on Tue, May 2 2023 2:58 PM

Met Gala 2023 Priyanka ChopraDiamond Necklace Is Worth Rs 204 Crores - Sakshi

న్యూఢిల్లీ: న్యూయార్క్‌లో అంతర్జాతీయ అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్‌ మెట్‌గాలా 2023లో తారలు సందడి గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్లోబల్‌ స్టార్ ప్రియాంక చోప్రా, తొలిసారి భర్త నిక్ జోనాస్ స్టైలిష్‌గా కనిపించారు. ఈ సందర్భంగా ఆమె ధరించిన  ఖరీదైన  డైమండ్‌ నెక్లెస్‌ హాట్‌టాపిక్‌గా నిలిచింది. 

మెట్‌గాలా 2023లో ప్రియాంక చోప్రా ప్రముఖ డిజైనర్ వాలెంటినో రూపొందించిన సెక్సీ బ్లాక్ గౌనులో చూపరులను కట్టి పడేసింది. ముఖ్యంగా బల్గారీకి చెందిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్‌ను ధరించింది. ఈ డైమండ్ నెక్లెస్ విలువ రూ. 204 కోట్లు అని వార్త హల్‌చల్‌ చేస్తోంది. మరోవైపు ఈ ఈవెంట్‌ తర్వాత 25 మిలియన్ల బల్గేరియో ఫీషియల్ నెక్లెస్ వేలం వేయనున్నారు.  (Realme 5th Anniversary Sale:స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ  ఆఫర్)

ప్రియాంక మూడోసారి ఈ ఈవెంట్‌లో తళుక్కు మనగా,  తొలిసారిగా  భర్తతలో కలిసి సందడి  చేసింది. ఇద్దరూ  బ్లాక్‌ అండ్‌వైట్‌ వాలెంటినో దుస్తుల్లో అలరించారు. ప్రియాంక ఇటీవల విడుదలైన  యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన అమెరికన్ వెబ్  సిరీస్‌కు  సిరీస్  సిటాడెల్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై  అలియా భట్‌ అరంగేట్రంతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది. అంతేకాదు రిలయన్స్‌అధినేత కుమార్తె ఇషా అంబానీ ప్రబల్ గురుంగ్ డిజైన్‌ చేసిన డిజైనర్‌  దుస్తుల్లో  మెరిసిపోయారు. ఇంకా ఫ్లోరెన్స్ పగ్, అన్నే హాత్వే, జారెడ్ లెటోరా కిమ్ కర్దాషియాన్, జెన్నిఫర్ లోపెజ్, నవోమి కాంప్‌బెల్  తదితరులు హాజరయ్యారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్యాషన్ షోలలో ఒకటి 'మెట్ గాలా'.  ఈ ఈవెంట్‌లో ఫ్యాషన్ దుస్తులపై ఫోకస్ చేస్తారు. ఈ సంవత్సరం థీమ్ ఫ్యాషన్ డిజైనర్ 2019లో మరణించిన ప్రసిద్ధ జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ లాగర్‌ఫెల్డ్. ఆయనకు ఈ ఈవెంట్‌ ఘన నివాళులర్పించింది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement