ఈశా అంబానీ రిలయన్స్ వారసురాలిగానే కాదు.. స్టయిల్ ఐకాన్‌గానూ ప్రసిద్ధురాలే! ఆమెకు ఆ స్టయిల్‌ని దిద్ది.. ఆమె ఐకానిక్ లుక్స్‌కి కారణమైన వ్యక్తి అమీ పటేల్! ఒక్క ఈశాకే కాదు ఎంతోమంది బాలీవుడ్ సెలబ్స్‌కి స్టయిల్‌ని సెట్ చేసిన ఈమె గురించి కొన్ని వివరాలు..
ఫ్యాషన్ ప్రపంచంలో అమీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనుకొని కాదు అనుకోకుండానే ఈ రంగంలోకి వచ్చింది. అమీ సొంతూరు ముంబై. అక్కడే పెరిగింది. అక్కడి సుప్రసిద్ధ సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో ఫైన్ ఆర్ట్స్ (పోర్ట్రెయిట్స్)లో మాస్టర్స్ చేసింది డిస్టింక్షన్‌తో.
ఫ్యాషన్ రంగంలో ఆమె జర్నీ ఎల్ ఇండియాలో ఆర్ట్ డైరెక్టర్‌గా మొదలై లోఫిసియల్ ఇండియాలో ఫ్యాషన్ డైరెక్టర్, హార్పర్స్ బాజార్‌లో క్రియేటివ్ డైరెక్టర్ హోదా దాకా సాగింది. ఫ్యాషన్ మ్యాగజీన్స్‌లో పనిచేస్తున్నప్పుడే బాలీవుడ్‌లో అవకాశం వచ్చింది కాస్ట్యూమ్ డిజైనర్‌గా. కంటిన్యూ అయింది. ఆ పరిచయాలు, ఆమె పనితీరు‡ఆమెను సెలబ్రిటీ స్టయిలింగ్‌కి ఇన్వైట్ చేశాయి. అలా అమీ స్టయిలింగ్ చేసిన ఫస్ట్ బాలీవుడ్ స్టార్ ప్రియంకా చోప్రా. ఆమెను పెళ్లి కూతురిగా ముస్తాబుచేసింది అమీనే.
ప్రియంకా పెళ్లిలో ఆమెను చూసినవారంతా అమీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఊహించని ఆ అవకాశం.. ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అందుకే సొంతంగా స్టయిలింగ్ ఫర్మ్‌ని స్టార్ట్ చేసింది ‘స్టయిల్ బై అమీ( ్టy ్ఛbyఅఝజీ)’ పేరుతో. బాలీవుడ్‌కి అమీ స్టయిల్ ఆఫ్ వర్క్ కొత్త కాదు.. పైగా ప్రియంకా చోప్రా స్టయిలింగ్‌తో ది బెస్ట్ స్టయిలిస్ట్‌గానూ ప్రూవ్ చేసుకుంది. సెలబ్రిటీల వర్క్ కాంట్రాక్ట్స్, అగ్రీమెంట్స్‌తో ‘స్టయిల్ బై అమీ’ బిజీ అయిపోయింది. ఆలియా భట్, మాధురీ దీక్షిత్, కత్రినా కైఫ్, రకుల్‌ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, శోభితా ధూళిపాళ.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంబానీ లేడీస్.. ఈశా అండ్ నీతా అంబానీలతో కనిపిస్తుంది అమీ సెలబ్రిటీ స్టయిలింగ్ లిస్ట్!
‘ప్రతి ప్రొఫెషన్‌లో అప్ అండ్ డౌన్స్ ఉన్నట్టే సెలబ్రిటీ స్టయిలింగ్ కెరీర్‌లోనూ ఉంటాయి. కాబట్టి చాలెంజింగ్‌గా ఉండాలి. స్టయిలింగ్‌కి ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటూ లేదు. దీనికి స్టయిలిస్ట్ దగ్గర ట్రైనింగ్‌ని మించిన చదువులేదు. కష్టపడి పనిచేసే తత్వం, సహనం, సామర్థ్యం అదనపు అర్హతలు. మంచి ట్రైనింగ్‌తో పాటు ఈ మూడూ ఉంటే ఈ కెరీర్‌లో అందలం ఎక్కొచ్చు. ఫ్యాషన్‌కి సంబంధించి ఇప్పుడు జెండర్ బారియర్స్ లేవు. అబ్బాయిలు స్కర్ట్స్ వేసుకుంటున్నారు.. అమ్మాయిలు లుంగీ, టీ షర్ట్‌ని ఇష్టపడుతున్నారు. సో కాస్ట్యూమ్స్‌కి లింగ భేదాల్లేకుండా పోయాయి. నిన్ను నువ్వు ఎక్స్‌ప్రెస్ చేసుకోవడమనే అర్థంలోకి మారిపోయింది ఫ్యాషన్.
"వర్ధమాన స్టయిలిస్ట్‌లు ఈ మార్పును దృష్టిలో పెట్టుకోవాలి. సెలబ్రిటీ స్టయిలింగ్ అంటే గ్లామరస్ జాబ్ కాదని గుర్తుంచుకోవాలి. ఏ డ్రెస్ వేసుకోవాలి.. దానికి మ్యాచింగ్ యాక్ససరీస్ ఏంటీ.. హెయిర్ స్టయిల్ ఎలా ఉండాలని డిక్టేట్ చేయడం కాదు స్టయిలింగ్ అంటే! సెలబ్రిటీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని.. ఆ పర్సనాలిటీకి తగినట్లుగా వాళ్లను తీర్చిదిద్దే క్లిష్టమైన పని అది. ఈ క్రమంలో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా సెలబ్రిటీ అభాసుపాలై.. వాళ్ల రెప్యుటేషనే పడిపోవచ్చు. అందుకే దీన్ని ఆషామాషీగా చూడొద్దు!’ అని ఔత్సాహిక స్టయిలిస్ట్‌లకు సలహా ఇస్తోంది" – అమీ పటేల్.
Comments
Please login to add a commentAdd a comment