అంబానీ ఇంట అందగాడు | Awesome Moment At The Ambani Wedding! Pet Dog | Sakshi

అంబానీ ఇంట అందగాడు

Jul 17 2024 7:46 AM | Updated on Jul 17 2024 9:25 AM

Awesome Moment At The Ambani Wedding! Pet Dog

అందమైన కాలర్‌తో పింక్, గోల్డెన్‌ జాకెట్‌ ధరించి అనంత్‌ అంబానీ కుటుంబ వస్త్రధారణతో పోటీ పడుతూ వివాహ కార్యక్రమాల్లో తనూ విశేషంగా ఆహూతులను ఆకట్టుకుంది ‘హ్యాపీ’ అనే డాగ్‌.  అహ్మదాబాద్‌కు చెందిన ఖ్యాతి అండ్‌ కరణ్‌ షా పంఖ్‌ డిజైనర్‌ పెట్‌ వేర్‌ దుస్తులను డిజైన్‌ చేసింది. స్వచ్ఛమైన సిల్క్‌ జాక్వర్డ్‌ ఫ్యాబ్రిక్‌తో ఆమె అంబానీల కోసం తయారు చేసిన పెంపుడు జంతువుల దుస్తుల్లో ఇది ఇరవై తొమ్మిదవది. 

వివాహ వేడుకలు జరుగుతున్నంతసేపూ హ్యాపీ హాయిగా మండపంపై తన స్థానాన్ని ఆక్రమించుకుని, చుట్టూ పరిశీలిస్తూ, చిత్ర విచిత్ర విన్యాసాలతో వీడియోల్లో  సందడి చేసింది. ఇషా అంబానీ కూతురు బేబీ ఆదియుశక్తి ప్రేమతో హ్యాపీని ఆలింగనం చేసుకుంటుండగా, ఆమె తండ్రి ఆనంద్‌ పిరమల్‌ కూతురును అనుసరిస్తూ కనిపిస్తాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోని  ‘అత్యంత అందగాడు’ అంటూ అభివర్ణించారు వ్యూవర్స్‌. అంబానీ కుటుంబం పెంపుడు జంతువు హ్యాపీ ఈ యేడాది జనవరిలో అనం  –రాధికల నిశ్చితార్థంలో ఉంగరం మోసే పాత్రను పోషించింది. అప్పుడే అంబానీ కుటుంబ ఫొటోలో ఇది ప్రధాన స్థానం పోందింది.

   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement