ఇషా అంబానీ గ్రాండ్‌ వెడ్డింగ్‌కార్డు.. వైరల్‌ | Isha Ambani and Anand Piramal wedding card | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 11 2018 6:16 PM | Last Updated on Sun, Nov 11 2018 7:00 PM

Isha Ambani and Anand Piramal wedding card - Sakshi

వివాహ ఆహ్వాన పత్రికలను వినూత్నంగా తయారు చేయించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. తమ సంపదను చాటుకోవడానికి, తమ గొప్పతనాన్ని నలుగురి ముందు ప్రదర్శించడానికి శుభలేఖలను గ్రాండ్‌గా రూపొందించడం తెలిసిందే. ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్‌ అంబానీ, నీతా అంబానీల తనయుడు ఆకాశ్‌ అంబానీ నిశ్చితార్థం వేడుక సందర్భంగా అత్యంత గ్రాండ్‌గా రూపొందించిన ఆహ్వాన పత్రిక వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అంబానీ ఇంట మరో శుభకార్యం జరగబోతోంది. ముకేశ్‌, నీతాల కూతురు ఈషా అంబానీ, ఆనంద్‌ పిరమిల్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. అత్యంత రిచ్‌గా రూపొందిన వీరి వెడ్డింగ్‌ కార్డు ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. అత్యంత అట్టహాసంగా భారీ వ్యయంతో రూపొందిన ఈ శుభలేఖను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

వెడ్డింగ్‌ కార్డు విశేషాలు..
రిచ్‌ లుక్‌తో అందంగా అలంకరించిన ఓ బాక్స్‌ రూపంలో ఉన్న వీరి వెడ్డింగ్‌ కార్డు వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. బాక్స్‌పైన ఇషా, ఆనంద్‌ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాలు ఉబ్బెత్తుగా ముద్రించారు. బాక్స్‌లో వధువరూల వివరాలు, వివాహ ముహూర్తంతోపాటు.. అందులోని పలు బాక్స్‌ల్లో కానుకలు ఉన్నాయి.  డైరీ రూపంలో ఉన్న పేజీల్లో దేవతల ఫోటోలతోపాటు విలువైన గాజులు కూడా ఇందులో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement