సగం స్థానాలు మహిళలకే | Half of the women seats | Sakshi
Sakshi News home page

సగం స్థానాలు మహిళలకే

Published Sat, Jan 9 2016 2:37 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

సగం స్థానాలు మహిళలకే

సగం స్థానాలు మహిళలకే

జీహెచ్‌ఎంసీ వార్డుల రిజర్వేషన్ల నోటిఫికేషన్ జారీ
♦ మహిళల(జనరల్)కు 44, బీసీలకు 50, ఎస్సీలకు 10,
♦ ఎస్టీలకు 2, రిజర్వు కానివి 44
♦ అన్ని కేటగిరీలు కలిపి మహిళలకు 75 వార్డుల కేటాయింపు
 
 సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ జారీకి కొద్దిసేపు ముందు ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ వార్డుల రిజర్వేషన్లను వెల్లడించింది. ఈ మేరకు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ శుక్రవారం జీవో (నంబర్ 25)ను జారీ చేసింది. ఈ జీవో వెలువడిన దాదాపు గంటన్నర వ్యవధిలో ఎన్నికల షెడ్యూల్‌ను జారీ చేశారు.  గ్రేటర్‌లోని మొత్తం 150 వార్డులకు(డివిజన్లకు)గాను స్థానిక సంస్థల్లో మహిళల కోటాగా 50 శాతం రిజర్వేన్లను వారికి వర్తింపజేస్తూ, ఆయా వర్గాలకు వార్డులను ఖరారు చేశారు. మొత్తం 150 వార్డులకు గాను  మహిళ(జనరల్)కు 44, బీసీలకు 50, ఎస్సీలకు 10, ఎస్టీలకు 2 వార్డులు రిజర్వు చేశారు. ఇవిపోను ఓపెన్ కేటగిరీలో 44 వార్డులు కేటాయించారు.

 మహిళలకు 75 సీట్లు..
 మహిళల కోటాలో భాగంగా 75 సీట్లు వారికి దక్కేందుకు జనరల్‌లో 44 వార్డులు, బీసీల్లో 25 వార్డులు , ఎస్సీల్లో 5 వార్డులు, ఎస్టీల్లో 1 వార్డు చొప్పున కేటాయించారు.

 వార్డుల వారీగా రిజర్వేషన్లు
 ఎస్టీ జనరల్(1): డివిజన్ నంబర్-46 (ఫలక్‌నూమా)
 ఎస్టీ మహిళ(1): 16 (హస్తినాపురం)
 ఎస్సీ జనరల్(5): 1 (కాప్రా), 4 (మీర్‌పేట్ హెచ్‌బీ కాలనీ), 62(జియాగూడ), 133 (మచ్చబొల్లారం), 135(వెంకటాపురం)
 ఎస్సీ  మహిళ(5):  60(రాజేంద్రనగర్), 90 (కవాడిగూడ), 142(అడ్డగుట్ట), 144(మెట్టుగూడ), 147(బన్సీలాల్‌పేట్)
 బీసీ జనరల్(25): 3(చర్లపల్లి), 29 (చావ్‌నీ), 39(సంతోష్‌నగర్), 43(చాంద్రాయణగుట్ట) 48(శాలిబండ), 51(గోషామహల్), 52(పురానాపూల్), 53(దూద్‌బౌలి), 54(జహనూమా), 55(రామ్‌నస్‌పురా), 56 (కిషన్‌బాగ్), 58(శాస్త్రీపురం), 64(దత్తాత్రేయనగర్), 65(కార్వాన్), 69(నానాల్‌నగర్) , 70(మెహిదీపట్నం), 71(గుడిమల్కాపూర్), 83(అంబర్‌పేట్), 88(భోలక్‌పూర్), 103 (బోరబండ), 112(రామచంద్రాపురం), 113 (పటాన్‌చెరు), 125(గాజులరామారం), 126 (జగద్గిరిగుట్ట), 127(రంగారెడ్డి నగర్)
 బీసీ  మహిళ(25): 9(రామాంతపూర్), 26 (ఓల్డ్‌మలక్‌పేట్), 34(తలాబ్‌చంచల్), 35 (గౌలీపుర), 37(కుర్మగూడ, 41(కంచన్‌బాగ్), 42(బార్కాస్), 47(నవబ్‌సాహెబ్‌కుంట), 49 (ఘాన్సీబజార్), 57(సులేమాన్‌నగర్), 61(అత్తాపూర్), 63(మంగళ్‌హాట్), 67(గోల్కొండ) , 68(టోలీచౌకీ), 72(ఆసిఫ్‌నగర్), 73(విజయనగర్‌కాలనీ), 74(అహ్మద్‌నగర్), 75(రెడ్‌హిల్స్), 76(మల్లేపల్లి), 82(గోల్నాక), 86 (ముషీరాబాద్), 101(ఎర్రగడ్డ), 128(చింత ల్),146(బౌద్దనగర్), 148(రాంగోపాల్‌పేట్)
 విమెన్ జనరల్(44): 2(డాక్టర్ ఎ.ఎస్.రావునగర్), 6(నాచారం), 7(చిలుకానగర్), 8(హబ్సీగూడ) , 10(ఉప్పల్) , 11(నాగోల్), 19(సరూర్‌నగర్), 20(ఆర్‌కేపురం), 24(సైదాబాద్), 25(మూసారాంబాగ్), 28(అజాంపుర) , 33(మోఘల్‌పురా), 38(ఐఎస్ సదన్), 66(లంగర్‌హౌజ్), 78(గన్‌ఫౌండ్రీ), 79(హిమాయత్‌నగర్), 80(కాచిగూడ), 81(నల్లకుం ట), 84(బాగ్‌అంబర్‌పేట్), 85(అడిక్‌మెట్), 89(గాంధీనగర్) , 91(ఖైరతాబాద్), 92(వెంకటేశ్వరకాలనీ), 97(సోమాజిగూడ), 98(అమీర్‌పేట్), 100(సనత్‌నగర్), 109(హఫీజ్‌పేట్) , 110(చందానగర్) , 111(భారతీనగర్), 115(బాలాజీనగర్), 116(అల్లాపూర్), 122(వివేకానంద్‌నగర్ కాలనీ), 130(సుభాష్‌నగర్), 131(కుత్బుల్లాపూర్), 132(జీడిమె ట్ల), 134(అల్వాల్), 136(నేరేడ్‌మెట్), 137(వినాయక్‌నగర్), 138(మౌలాలి), 141(గౌతంనగర్),143(తార్నాక),145(సీతాఫల్‌మండి), 149(బేగంపేట్),150(మోండామార్కెట్).
 అన్‌రిజర్వ్‌డ్(44): 5(మల్లాపూర్), 12(మన్సూరాబాద్), 13(హయత్‌నగర్), 14(బీఎన్‌రెడ్డి నగర్), 15(వనస్థలీపురం), 17(చంపాపేట్), 18(లింగోజీగూడ), 21(కొత్తపేట్), 22(చైతన్యపురి), 23(గడ్డి అన్నారం), 27(అక్బర్‌బాగ్), 30(డబీర్‌పురా), 31(రెయిన్‌బజా ర్), 32(పత్తర్‌గట్టి), 36(లలితాబాగ్), 40(రియాసత్‌నగర్), 44(ఉప్పుగూడ), 45(జంగంమెట్), 50(బేగంబజార్), 59(మైలార్‌దేవుపల్లి), 77(జాంబాగ్), 87(రాంనగర్), 93 (బంజారాహిల్స్), 94(షేక్‌పేట్), 95(జూబ్లీహిల్స్), 96(యూసఫ్‌గూడ), 99(వెంగళ్‌రావునగర్), 102(రహమత్‌నగర్), 104(కొండాపూర్),105(గచ్చిబౌలి), 106(శేరిలింగంపల్లి), 107(మాదాపూర్), 108(మియాపూర్), 114(కేపీహెచ్‌బీ కాలనీ), 117(మూసాపేట్), 118(ఫత్తేనగర్), 119(ఓల్డ్‌బోయిన్‌పల్లి), 120 (బాలానగర్), 121(కూకట్‌పల్లి), 123(హైదర్‌నగర్), 124(ఆల్వీన్‌కాలనీ), 129(సూరారం), 139(ఈస్ట్‌ఆనంద్‌బాగ్), 140 (మల్కాజిగిరి).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement