గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 50 స్థానాల్లో ఆటోడ్రైవర్లు పోటీ చేయనున్నట్లు స్టార్ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ అసోసియేషన్ ...........
సుల్తాన్‌బజార్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 50 స్థానాల్లో ఆటోడ్రైవర్లు పోటీ చేయనున్నట్లు స్టార్ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ అబ్దుల్ ఖాదర్ పాషా తెలిపారు. సోమవారం ఆయన హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో విలేకరులతో మాట్లాడుతూ... గత 40 ఏళ్లుగా ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ప్రభుత్వం ఈ-ఛలాన్‌ల పేరిట ఆటోవాలాలను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. 50 స్థానాల్లో పోటీ చేసి తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటామని ఆయన పేర్కొన్నారు.