Auto drivers union
-
ఇంటి స్థలాన్ని తనఖా పెట్టిన మంత్రి హరీశ్
సాక్షి, సిద్దిపేట : అందరి జీవితాలను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ఆటో కార్మికులనూ కుదేలుచేసింది. కుటుంబపోషణకు దాతల సాయం కోసం ఎదురుచూసే పరిస్థితిలోకి నెట్టేసింది. వారి కుటుంబాల దయనీయస్థితిని పరిశీలించిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు.. వారికి జీవితాలపై భరోసా కల్పించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులతో సహకార పరపతి సంఘం ఏర్పాటు చేయించి ఆర్థికంగా అండగా నిలిచారు. ప్రభుత్వం నుంచి ఈ సంఘానికి నేరుగా డబ్బులిచ్చే అవకాశం లేనందున మూలధనం కోసం మంత్రి తన ఇంటి స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రూ.45 లక్షలు అప్పు తీసుకొని సంఘంలో జమచేయించారు. సంఘాన్ని గురువారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులకు బ్యాంకు ఏటీఎం కార్డులు, లైసెన్స్, జత యూనిఫాం అందించనున్నారు. చదవండి: మ్యారేజ్ బ్యూరో: ఇక్కడ వ్యవసాయం చేసే వారికే పెళ్లిళ్లు.. మంత్రి మాటతో ఏకతాటిపైకి.. కరోనా తదనంతరం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న జిల్లావ్యాప్తంగా గల 855 మంది ఆటో కార్మికులు మంత్రి సూచనతో.. సహకార పరప తి సంఘంగా ఏర్పడాలనే అభిప్రాయానికొచ్చా రు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఆటో కార్మికుల సహకార పరపతి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంఘం విధివిధానాలపై అధికారులను కలవగా.. పరపతి సంఘం ఏర్పాటు, రుణాల మంజూరుకు మూలధనం అవసరమని చెప్పా రు. దీంతో సభ్యులు ఒక్కొక్కరు తమ వాటాధనంగా రూ.1,110 చొప్పున రూ. 8,55,000 జమ చేశారు. సంఘం ఏర్పాటు, రిజిస్ట్రేషన్, ఇతర ఖర్చులకు రూ.55 వేలు వినియోగించారు. అయితే మిగిలిన మొత్తం మూలధనంగా సరిపోదని తెలిసి దిగాలుపడ్డారు. మంత్రి ఇంటి స్థలం తనఖా పెట్టి.. ఆటోడ్రైవర్లంతా మంత్రి హరీశ్‌రావును కలిసి విషయం చెప్పారు. స్పందించిన మంత్రి.. ప్రభుత్వం నుంచి ఈ సంఘానికి నేరుగా డబ్బులిచ్చే అవకాశం లేదని గుర్తించారు. వెంటనే సిద్దిపేట పట్టణం రంగధాంపల్లిలో గల తన ఇంటి స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రూ.45 లక్షలు అప్పు తీసుకొని పరపతి సంఘంలో జమచేయించారు. ఇలా మొత్తం రూ.53 లక్షల మూలధనంతో పరపతి సంఘం ఏర్పాటైంది. దీంతోపాటు తన మిత్రుల సహకారంతో 666 మంది ఆటోకార్మికులకు రూ. 2లక్షల చొప్పున బీమా కోసం ప్రీమియం కూడా చెల్లించారు. సిద్దిపేట డీటీవోతో మాట్లాడి అందరికీ డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇప్పించారు. సంఘం నిర్వహణకు ప్రణాళిక పరపతి సంఘం నిర్వహణకు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు, రిటైర్డ్ పోలీస్ అధికారి, డాక్టర్, అకౌంటెంట్‌తో నిర్వాహక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. నెలవారీ పొదుపు, రుణాల మంజూరు వంటివి ఇది చూసుకుంటుంది. సభ్యుల ఇళ్లలో ఎవరైనా చనిపోయినా, పెళ్లయినా సంఘం నుంచి రూ. 5వేలు అందిస్తారు. సభ్యులకు నైతిక విలువలు, వ్యక్తిగత పరిశుభ్రత, కుటుంబపోషణ, పిల్లల చదువులు, ఆటోల్లో ప్రయాణించే వారితో మర్యాదగా నడుచుకోవడం మొదలైన అంశాలపై ప్రతీ నెలా శిక్షణనిస్తారు. భరోసా కల్పించేందుకే.. కరోనా కాలంలో ఆటోడ్రైవర్లు పడిన ఇబ్బందులు, కుటుంబాల పరిస్థితి విన్నాక వారికి ఆర్థిక, సామాజికంగా భరోసా కల్పించాలని అనుకున్నాం. పరపతి సంఘం ఏర్పాటుచేస్తే తక్కువ వడ్డీ, సులభ వాయిదాలకు రుణాలు వస్తాయి. బీమా సౌకర్యం ఉంటుంది. అయితే, మూలధనాన్ని వారు సమకూర్చుకోలేని పరిస్థితి. అందుకే నాకు తోచిన, చేతనైన సాయం చేశాను. ఈ సాయంతో ఆటోవాలాలు నిలదొక్కుకుంటే చాలు. – తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి జీవితాల్లో మార్పులు తేవాలని.. ఆటో కార్మికులు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. వారి జీవితాల్లో మార్పునకు సంఘం ద్వారా కృషి చేస్తాం. సిద్దిపేట ఆటో కార్మికులంటే ఆదర్శంగా నిలవాలనేది మా ఆలోచన. సంఘం ఏర్పాటుకు మంత్రి హరీశ్‌రావు చేసిన త్యాగం మరువలేం. – పాల సాయిరాం, సంఘం అధ్యక్షుడు చేసిన కష్టం అప్పులకే పోయేది ఆటో నడిస్తేనే కుటుంబాలు గడుస్తాయి. రిపేర్, కొత్త ఆటోలు కొనుగోలు, ఇంటి ఖర్చులకు అధిక వడ్డీలకు అప్పులు చేసేవాళ్లం. రోజువారీ సంపాదన అప్పులు తీర్చేందుకే సరిపోయేది. మంత్రి హరీశ్‌రావు ఆర్థిక చేయూతతో మా జీవితాలు నిలబడ్డాయి. – ఎండీ ఉమర్, పరపతి సంఘం సభ్యుడు -
మాట ఇచ్చిన చోటే.. మరో చరిత్రకు శ్రీకారం
సాక్షి, అమరావతి: మాట ఇచ్చిన చోటే మరో చరిత్రకు శ్రీకారం చుడుతూ ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఏలూరులో ప్రారంభించనున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర సమయంలో ఆటోడ్రైవర్ల కష్టాలు చూసి చలించిన వైఎస్ జగన్ ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌ల ఫిట్నెస్, బీమా, మరమ్మతుల కోసం ఏటా రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయం అందచేస్తామని నాడు ఏలూరులో జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే నేడు వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించనున్నారు. మాట ఇచ్చిన చోటు నుంచే పథకానికి శ్రీకారం చుట్టడం అరుదైన విషయమని, వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని ఆటో డ్రైవర్ల సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ పథకం ద్వారా మొత్తం 1,73,531 మంది లబ్ధి పొందనున్నారు. లబ్ధిదారుల్లో అత్యధికులు బీసీలే.. వైఎస్సార్ వాహనమిత్ర పథకం దరఖాస్తుదారులు 1,75,352 మంది కాగా అర్హులైన లబ్ధిదారులు 1,73,531 మంది అని గ్రామ వలంటీర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిశీలనలో తేల్చారు. కలెక్టర్ల ఆమోదముద్రతో అర్హులను రవాణా శాఖ అధికారులు నిర్థారించారు. లబ్ధిదారుల్లో అత్యధికంగా బీసీలే ఉన్నారు. 1,73,531 మంది లబ్ధిదారుల్లో 79,021 మంది బీసీలే కావడం గమనార్హం. విశాఖపట్టణం, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయి. -
ఆటోవాలా పథకంపై జననేతకు కృతజ్ఞతలు తెలిపిన ఆటోడైవర్లు
-
పోలీసు కేసులతో ఇబ్బంది పడుతున్నాం
ఆటోలు నడుపుకొంటూ ఆ కిరాయిలపై వచ్చే చాలీచాలని ఆదాయంపై ఆధారపడి జీవిస్తున్న మాపై బ్రేక్ ఇన్స్పెక్టర్ల కంటే పోలీసులే కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నామని పెద్దాపురం మండల ఫ్రెండ్స్ ఆటో యూనియన్ డ్రైవర్లు, యజమానులు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు జగన్‌కు వినతిపత్రం ఇచ్చి మాట్లాడుతూ ఆటోలకు సంబంధించిన రికార్డులు ఉన్నప్పటికీ తప్పుడు కేసులతో పోలీసులు ఆటోలను సీజ్ చేస్తున్నారన్నారు. తెలంగాణలోలా బ్రేక్ రద్దు చేసి, బీమా తగ్గించాలన్నారు. బ్రేక్ చేయించుకోవడం ఆలస్యమైతే జరిమానా రూ.50 నుంచి రూ.10లకు తగ్గించారని దానిని కూడా రద్దు చేయాలని కోరారు. తామంతా ఆటోలు నడుపుకుంటూ జీవిస్తున్నామని, ఒక్క మాధవపట్నంలో సుమారు 850 కుటుంబాలు ఉన్నాయన్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న డీజిల్ ధరల వలన ఇబ్బంది పడుతున్నామని, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని జగన్‌కు విజ్ఞప్తి చేశారు. -
50 స్థానాల్లో ఆటోడ్రైవర్ల పోటీ
సుల్తాన్‌బజార్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 50 స్థానాల్లో ఆటోడ్రైవర్లు పోటీ చేయనున్నట్లు స్టార్ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ అబ్దుల్ ఖాదర్ పాషా తెలిపారు. సోమవారం ఆయన హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో విలేకరులతో మాట్లాడుతూ... గత 40 ఏళ్లుగా ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ప్రభుత్వం ఈ-ఛలాన్ల పేరిట ఆటోవాలాలను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. 50 స్థానాల్లో పోటీ చేసి తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
బంద్‌కు పిలుపు
సాక్షి, చెన్నై: ఒక రోజు బంద్‌కు ఆటోకార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈనెల 19న రాజధాని నగరంలో ఆటోల సేవలను పూర్తిగా నిలిపివేయనున్నారు. చార్జీల పునఃపరిశీలన, ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు డిమాండ్, అధికారుల వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆటో కార్మిక సంఘాల సమాఖ్య ఆదివారం ప్రకటించింది. రాజధాని నగరంలో ఆటో వాలాల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు చార్జీలను ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టుల్లో ఈ చార్జీలు అమల్లోకి వచ్చినా, ఇంత వరకు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కొన్ని చోట్ల మీటర్లు వేస్తున్నా, మరి కొన్ని చోట్ల ఆటో వాలాలు అడిగినంత ఇవ్వాల్సిందే. ఈ దోపిడీపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆటో వాలాల భరతం పట్టే విధంగా ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులు ఉరకలు తీస్తున్నారు. రోజుకు సుమారు మూడు నుంచి ఐదు వరకు ఆటోల్ని సీజ్ చేయడం లేదా, జరిమానాల మోత మోగించడం చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో తమ మీద అధికారులు చూపుతున్న వైఖరిని, చార్జీలు నామమాత్రంగానే ఉన్నాయంటూ ఆటో డ్రైవర్లు, యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటికే పలు మార్లు చెన్నైలో ఆందోళనలకు దిగిన ఆటో కార్మిక సంఘాలు, ఇక తమ ఆందోళనలను ఉధృతం చేయడానికి నిర్ణయించారు. ఆటోల బంద్‌కు పిలుపు : ఆదివారం చెన్నైలో ఆటో కార్మిక సంఘాలన్నీ ఏక మయ్యాయి. అన్ని సంఘాల నాయకులు, ప్రతినిధులు గంటన్నరకు పైగా చర్చించారు. తమ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఒక రోజు బంద్‌కు పిలుపునిస్తూ ప్రకటన చేశారు. తీర్మానాల్ని ప్రకటించారు. మీటర్లు లేవని, వేయడం లేదన్న సాకుతో ఆటో డ్రైవర్లను ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులు వేధించుకు తింటున్నారని ఆరోపించారు. రోజుకు ఐదు ఆటోలు సీజ్ చేస్తున్నారని, ఒక్కోఆటోకు రూ.2000 నుంచి రూ.3000 వరకు జరిమానాలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో చార్జీలను పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందు కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ ఆటో డ్రైవర్లు, యాజమాన్యాలు, ప్రయాణికులు ఇలా అన్ని వర్గాల వారితో చర్చించినానంతరం కొత్త చార్జీలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. చార్జీల పునఃపరిశీలన, తమ డిమాండ్ల సాధన, అధికారుల వైఖరిని ఖండిస్తూ ఈనెల 19న చెన్నైలో ఆటోల బంద్‌కు పిలుపు నిస్తున్నామని ప్రకటించారు. ఆటోలు ఆ రోజు నడపబోమని, అన్ని సంఘాలు ఏకమై తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని ఆటో డ్రైవర్లకు పిలుపు నిచ్చారు.