ఆటోలు నడుపుకొంటూ ఆ కిరాయిలపై వచ్చే చాలీచాలని ఆదాయంపై ఆధారపడి జీవిస్తున్న మాపై బ్రేక్ ఇన్‌స్పెక్టర్ల కంటే పోలీసులే కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నామని పెద్దాపురం మండల ఫ్రెండ్స్ ఆటో యూనియన్ డ్రైవర్లు, యజమానులు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు జగన్‌కు వినతిపత్రం ఇచ్చి మాట్లాడుతూ ఆటోలకు సంబంధించిన రికార్డులు ఉన్నప్పటికీ తప్పుడు కేసులతో పోలీసులు ఆటోలను సీజ్ చేస్తున్నారన్నారు. తెలంగాణలోలా బ్రేక్ రద్దు చేసి, బీమా తగ్గించాలన్నారు. బ్రేక్ చేయించుకోవడం ఆలస్యమైతే జరిమానా రూ.50 నుంచి రూ.10లకు తగ్గించారని దానిని కూడా రద్దు చేయాలని కోరారు. తామంతా ఆటోలు నడుపుకుంటూ జీవిస్తున్నామని, ఒక్క మాధవపట్నంలో సుమారు 850 కుటుంబాలు ఉన్నాయన్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న డీజిల్ ధరల వలన ఇబ్బంది పడుతున్నామని, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని జగన్‌కు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment