
ఓర్నీ...ఓమ్నీ
ఈ ఓమ్నీని చూశారా? పుష్పక విమానంలా ఎంతమందిని మోసుకెళుతోందో... వీఎస్‌టీ ఫంక్షన్ హాలులో ఓ పార్టీ సమావేశానికి సోమవారం రాంనగర్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మహిళలను తీసుకొచ్చారు. సమావేశం ముగిసిన తరువాత ఓమ్నీ వ్యాన్‌లో సుమారు 25 మంది మహిళలను కుక్కి.. గాలి కూడా అందని స్థితిలో వారిని ఇళ్లకు తరలించారు. ఈ దృశ్యం చూసిన వారు జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మున్ముందు ఇంకా ఎన్ని వి‘చిత్రాలు’ చూడాల్సి వస్తుందోనని వ్యాఖ్యానించారు.
చిత్రం: ఎం.రవికుమార్