ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్.. ఫొటో వైరల్.. | Ex CM KCR Drives Omni Car At Erravelli Photo Viral | Sakshi
Sakshi News home page

ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్.. ఫొటో వైరల్..

Jun 27 2024 8:14 PM | Updated on Jun 27 2024 8:22 PM

Ex CM KCR Drives Omni Car At Erravelli Photo Viral

సాక్షి, హైద‌రాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ న‌డిపారు. ఓమ్నీ వ్యాన్ స్టీరింగ్‌ను త‌న చేతుల్లోకి తీసుకుని కేసీఆర్ డ్రైవింగ్ చేసి అంద‌రినీ అశ్చ‌ర్య‌ప‌రిచారు. కేసీఆర్ డ్రైవింగ్ చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వ్యాన్‌ను స్వయంగా కేసీఆరే నడపటం వెనుక కథ వేరే ఉంది.

కాగా గ‌తేడాది డిసెంబ‌ర్ 8వ తేదీ అర్ధ‌రాత్రి కేసీఆర్ కాలు జారిప‌డ్డ సంగ‌తి తెలిసిందే. దీంతో కుటుంబ స‌భ్యులు కేసీఆర్‌ను సోమాజిగూడ‌లోని య‌శోదా ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేయించారు. కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా కేసీఆర్ న‌డుస్తున్నారు. అయితే మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్లు సూచించ‌డంతో తన పాత ఓమ్నీ వ్యాన్‌ను కేసీఆర్ గురువారం న‌డిపారు.

కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ న‌డుపుతూ ఎర్ర‌వ‌ల్లి పొరుగు గ్రామాల‌ను సంద‌ర్శించారు. రోడ్ల‌పై క‌న‌బ‌డిన వారిని ఆప్యాయంగా ప‌లుక‌రిస్తూ త‌న వాహ‌నాన్ని ముందుకు పోనిచ్చారు. కేసీఆర్ ప‌లుక‌రింపుతో స్థానికులు సంతోషం వ్య‌క్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement