సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఏమిచ్చిందని అంటున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌కు ఏం చేశారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను హిందూ– ముస్లింల మధ్య పోటీగా చిత్రీకరించవద్దని కోరారు. చింతమడకకు కేసీఆర్ ఇచ్చింది రూ. 1.5 లక్షలేనని, కేంద్రం రూ. 8 లక్షలు ఇచ్చిందని, అలాగే భాగ్యనగరంలో రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. దేవాలయాల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్, కేటీఆర్‌లకు లేదన్నారు. (మేమొస్తే పాతబస్తీ.. భాగ్యనగరమే)
నగరంలో మాకు నచ్చిన ఆలయానికి వెళ్తామని, గుడికి వెళ్లాలంటే కేసీఆర్ అనుమతి తీసుకోవాలా లేక ఒవైసీల అనుమతి కావాలా అని ప్రశ్నించారు. హిందూగాళ్లు.. బొందుగాళ్లు అన్నందుకు కరీంనగర్ ప్రజ లు టీఆర్‌ఎస్‌కు సరైన సమాధానం చెప్పారని వ్యాఖ్యానించారు. టీఆర్ ఎస్ వచ్చాకే హైదరాబాద్‌లో అరాచకాలు పెరిగాయన్నారు. సామాన్యుల ఇళ కు వేల రూపాయల పన్నులు వేస్తూ, మౌలాలి టీఆర్‌ఎస్ కార్పొరేటర్ ఇం టికి రూ.101 మాత్రమే పన్ను వేయ డం ఈ ప్రభుత్వానికి న్యాయమేనా అని రఘునందన్ ప్రశ్నించారు. (పాతబస్తీలో 10 నుంచి 15 స్థానాలు గెలుస్తాం )
Comments
Please login to add a commentAdd a comment