
అభివృద్ధే టీఆర్‌ఎస్ లక్ష్యం
చంపాపేట: తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి, పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. వివిధ పార్టీల నాయకులు, మాజీ కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా సోమవారం రాత్రి చంపాపేట డివిజన్ కొత్త కాపు యాదవరెడ్డి ఫంక్షన్ హాల్‌లో సమావే శం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైనకేటీఆర్ మాట్లాడుతూ గత 60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చేయనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
సమగ్ర సర్వేపై టీడీపీ, కాంగ్రెస్‌లు అసత్య ప్రచారాలు చేశాయన్నారు. మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నేతలు సామ రమణారెడ్డి, గజ్జెల సుష్మామధుసూధన్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన లింగాల నాగేశ్వరరావు, రాహుల్ గౌడ్, భవానీ ప్రవీణ్ కుమార్, బీజేవైఎం నాయకుడు కళ్లెం నవజీవన్‌రెడ్డిలతో పాటు పలువురు కార్యకర్తలకు ఆయన కండువాలను వేసి..టీఆర్‌ఎస్‌లోకిఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహేందర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, తలసాని, ఎంపీ బాల్క సుమన్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పాల్గొన్నారు.