డీఎంకే అధినేత దివంగత కరుణానిధికి సీపీఐ ఘన నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణ సోమవారం చెన్నైలోని గోపాలపురం నివాసంలో కరుణానిధి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.