ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టంలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పే ధైర్యం బీజేపీకి లేదని, ఇవ్వాలని అడిగే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేదని ఆయన విమర్శించారు. ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయాల్సిన అవసరంలేదని సురవరం అభిప్రాయపడ్డారు.