ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్‌లో ఆ పార్టీ శ్రేణులను టీడీపీ ప్రభుత్వం పోలీసుల చేత అరెస్ట్ చేయించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తప్పుపట్టారు. ఢిల్లీలో సాక్షి టీవీతో మాట్లాడుతూ..గతంలోనూ ప్రత్యేక హోదాపై నిర్వహించిన బంద్‌లను టీడీపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు.