న్యూఢిల్లీ : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. జూతై 19, 20 తేదీల్లో ఢిల్లీలో జరిగే సీపీఐ జాతీయ మండలి సమావేశాల్లో ఆయన రాజీనామా సమర్పిస్తారని వెల్లడించాయి. ఈ విషయమై ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ...‘సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ కేవలం రెండు లోక్‌సభ స్థానాలకు పరిమితం కావడంతో పార్టీ ఓటమికి నైతిక బాద్యత వహిస్తూ సుధాకర్‌రెడ్డి రాజీనామా చేయాలని నిర్ణయించారు. పార్టీ కోసం పనిచేసేందుకు తన ఆరోగ్యం సహకరించడం లేదని, ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు’ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment