
సురవరం సుధాకర్‌రెడ్డి
న్యూఢిల్లీ: బీజేపీని ఓడించటంతోపాటు లౌకిక ప్రజాస్వామ్య పార్టీలతో జట్టుకట్టే విషయంలో రాష్ట్రాల వారీగానే పొత్తులు పెట్టుకోనున్నట్లు సీపీఐ తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో∙ప్రత్యేక పరిస్థితులను బట్టి, వైఖరి మార్చుకుంటామని గురువారం విడుదల చేసిన రాజకీయ తీర్మానంలో పేర్కొంది. బీజేపీని గద్దె దించటమే తమ ఏకైక లక్ష్యమని స్పష్టం చేసింది. ఫాసిస్ట్ శక్తులపై పోరాడేందుకు లౌకిక రాజకీయ శక్తులను ప్రజా సంఘాలను కూడగడతామని పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. సీపీఎం, సీపీఐ మధ్య సమస్యలుంటే పరిష్కరించుకుంటామన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని సీపీఎం గతంలోనే తేల్చిచెప్పింది.