Allies
-
Lok sabha elections 2024: వారే వీరయ్యారు!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడిని మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి నిరూపించాయి. గతంలో ప్రత్యర్థులుగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుని, ఎత్తుకు పై ఎత్తులు వేసిన నేతలు ఇప్పుడు హఠాత్తుగా మిత్రులైపోయారు. కొత్త మిత్రుల గెలుపు కోసం లోక్‌సభ సమరాంగణంలో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గతంలో స్నేహితులుగా ఉన్నవారు కాస్తా ఇప్పుడు శత్రువులుగా మారి రాజకీయ చదరంగంలో కొత్త గెలుపు ఎత్తులు వేస్తున్నారు. అజిత్ వర్సెస్ కోల్హే 2019 లోక్‌సభ ఎన్నికల్లో శిరూర్ శివసేన సిట్టింగ్ ఎంపీ శివాజీరావ్ అథాల్‌రావ్ పాటిల్‌ను ఎలాగైనా ఓడించాలని అజిత్ కంకణం కట్టుకున్నారు. టీవీ, సినీ రంగ ప్రముఖుడు అమోల్ రాంసింగ్ కోల్హేను శివసేన నుంచి ఎన్సీపీలో చేర్చుకుని మరీ శివాజీరావ్పై పోటీకి దింపారు. విస్తృత ప్రచారం చేసి కోల్హేను గెలిపించారు. కానీ ఎన్సీపీ చీలిక ఎపిసోడ్లో కోల్హే అజిత్‌ను కాదని శరద్ పవార్‌కు మద్దతుగా నిలవడంతో వారిద్దరికీ చెడింది. బీజేపీ, శివసేనతో సీట్ల సర్దుబాటులో భాగంగా షిరూర్‌లో సొంత అభ్యరి్థని నిలబెట్టే అవకాశం అజిత్‌కు లభించింది. దాంతో కోల్హేను ఎలాగైనా ఓడించాలని పట్టుదలగా ఉన్నారు. అందుకోసం గత ఎన్నికల్లో తానోడించిన అథాల్‌రావ్ పాటిల్‌నే కోల్హేపై పోటీకి నిలబెట్టారు! ఆయన తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. వదినా మరదళ్ల వార్ బారామతిలో చాన్నాళ్లుగా శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీచేస్తున్నారు. ఎన్సీపీలో చీలిక తర్వాత ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు అజిత్ తన భార్య సునేత్రను బరిలో దింపారు. దీంతో వదినా మరదళ్లు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. పైగా అజిత్ తమ్ముడు శ్రీనివాస్, ఆయన కుటుంబీకులు సూలేకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు! ఇది అజిత్ కుటుంబంలో మరో చీలికకు కారణమవుతోంది. నాడు వేర్వేరు సభలు.. ఇప్పుడు ఒకే స్థానం కోసం పోరు రాహుల్ రమేశ్ షేవలే, అనిల్ దేశాయ్ అవిభాజ్య శివసేనలో సన్నిహిత మిత్రులుగా మెలిగారు. రాహుల్ రెండుసార్లు సౌత్ సెంట్రల్ ముంబై ఎంపీగా గెలవగా అనిల్ రాజ్య సభ సభ్యునిగా ఉండేవారు. శివసేన చీలాక రాహుల్ షిండే వర్గంలో చేరగా అనిల్ ఉద్ధవ్ వర్గంలోనే కొనసాగారు. ఈసారి ఇద్దరూ సౌత్ సెంట్రల్ ముంబై నుంచి ప్రత్యర్థులుగా బరిలో దిగారు. అనిల్‌కు ముంబై కాంగ్రెస్ చీఫ్ వర్షా గైక్వాడ్ మద్దతు పలికారు. వర్ష తండ్రి ఏక్నాథ్ను 2014 లోక్‌సభ ఎన్నికల్లో షేవలే ఓడించడమే అందుకు కారణం. ‘‘దేవేంద్ర ఫడ్నవిస్ చాణిక్యంతో చీలికలు తేనంతవరకూ శివసేన, ఎస్సీపీ కుటుంబ పారీ్టలుగా నిక్షేపంగా ఉండేవి. వాటిలో చీలి కతో లోక్‌సభ ఎన్నికలు మహాభారత యుద్ధా న్నే తలపిస్తున్నాయి. కుటుంబసభ్యులే పరస్పరం పోటీపడుతూ ప్రత్యర్థులకు సాయం చేస్తున్నారు’’ అని సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకులు ప్రకాశ్ అకోల్కర్ అభిప్రాయపడ్డారు. చిఖ్లీకర్ కోసం చవాన్ ప్రచారం గురువారం నాందేడ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ర్యాలీలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, బీజేపీ అభ్యర్థి ప్రతాప్ పాటిల్ చిఖ్లీకర్ ఒకే వేదికను పంచుకున్నారు. గత ఫిబ్రవరి దాకా వారిద్దరూ బద్ధ శత్రువులు. చిక్లీకర్ లోహా నుంచి శివసేన ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో నాందేడ్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ అశోక్ చవాన్‌ను మట్టికరిపించారు. చవాన్ కూడా తాజాగా బీజేపీలో చేరడంతో వారి మధ్య వైరం మటుమాయమైంది. ఫిబ్రవరిలో బీజేపీలో చేరి రాజ్యసభకు ఎన్నికైన చవాన్ ఇప్పుడు చిక్లీకర్కు స్నేహహస్తం అందించారు. చిక్లీకర్ గెలుపు కోసం మరఠ్వాడాలో తెగ ప్రచారం చేస్తున్నారు. బరనే కోసం అజిత్... గత లోక్‌సభ ఎన్నికల్లో మావల్ నుంచి ఎన్సీపీ నేత అజిత్ పవార్ కుమారుడు పార్థపై శివసేన నేత శ్రీరంగ్ బరనే గెలిచారు. నాటినుంచి అజిత్, బరనే మధ్య వైరం పెరిగింది. కానీ తాజా పరిణామాలతో వారి మధ్య స్నేహం చిగురించింది. శివసేనను ఏక్నాథ్ షిండే, ఎన్సీపీని అజిత్ చీల్చి బీజేపీతో జట్టుకట్టడం తెలిసిందే. బరనే కూడా షిండే వెంట నడిచారు. దాంతో అజిత్‌తో ఆయన శత్రుత్వం సమసిపోయింది. ఈ నేపథ్యంలో అజిత్ ఈసారి బరనే కోసం ప్రచారం చేస్తున్నారు. నాడు ఓడించి నేడు ప్రచారం చేస్తూ.. బీజేపీ అధిష్టానం ఈసారి బీడ్ నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రీతం ముండే స్థానంలో ఆమె సోదరి, మాజీ మంత్రి పంకజా ముండేను ఎంపిక చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పంకజ తన బంధువైన ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే చేతిలో ఓడారు. ఇప్పుడాయన అజిత్ ఎన్సీపీలో ఉన్నారు. బీజేపీతో ఎన్సీపీ చెలిమి నేపథ్యంలో పంకజ తరపున ధనంజయ్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. –సాక్షి, న్యూఢిల్లీ -
ఎన్ని తగ్గిస్తే అన్ని నెగ్గినంత!
28 పార్టీల ‘ఇండియా’ కూటమి ప్రధాన లక్ష్యం ఏమిటి అన్నదాన్ని బట్టే అది తన లక్ష్యం సాధించగలదా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. బీజేపీని 272 సీట్ల కన్నా తక్కువకు నియంత్రించి, మిత్రపక్షాల మద్దతు లేనిదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితికి తేవడమా? లేక, కూటమిలోని 28 పార్టీలు దేనికదిగా అత్యధిక సీట్లలో విజయం సాధించటమా? ఈ రెండు కూడా వేర్వేరు లక్ష్యాలు. అత్యధిక సీట్లను గెలుచుకోవటమే ‘ఇండియా’ కూటమి లక్ష్యమైతే... చేజేతులా బీజేపీని తిరుగులేని విధంగా అధికారంలోకి రానివ్వటమే! అలా కాకూడదంటే, ఓట్లు చీలకుండా ఆ యా పార్టీలు తాము గెలవలేని రాష్ట్రాల్లో మిత్రపక్షాల కోసం సీట్లను త్యాగం చేయవలసి ఉంటుంది. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం సరళమైనది, సూటిగా మాట్లాడు కోబోయేదీ. అదేమిటంటే – వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీని, భార తీయ జనతా పార్టీని ‘ఓడించాలన్న’ 28 పార్టీల ‘ఇండియా’ కూటమి కల నిజం అవుతుందా అన్నది! అయితే ఆ కల నిజం అవటం అన్నది ఒకే ఒక ప్రశ్నకు లభించే సమాధానం పైనే అధారపడి ఉంటుంది. ‘ఇండియా’ కూటమి లక్ష్యం ఏమిటన్నదే ఆ ప్రశ్న. బీజేపీని 272 సీట్ల కన్నా తక్కువకు నెట్టేసి, మిత్రపక్షాల మద్దతు లేనిదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితికి ఆ పార్టీ తేవడమా? లేక, కూటమిలోని 28 పార్టీలు దేనికదిగా అత్యధిక సీట్లలో విజయం సాధించటమా? ఇవి రెండూ వేర్వేరు లక్ష్యాలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే లక్ష్యంగా అవి కూటమి కలను సాకారం చేయగలిగినవి కావు. రెండు లక్ష్యాలకు వేటికవిగా భిన్న విధానాలు, భిన్న వ్యూహాలు అవసరం. అత్యధిక సీట్లను గెలుచుకోవటమే తన లక్ష్యంగా ‘ఇండియా’ కూటమి పెట్టు కున్నట్లయితే... అది చేజేతులా చాలా పెద్ద సంఖ్యలో సీట్ల గెలుపుతో బీజేపీని తిరుగులేని విధంగా అధికారంలోకి రానివ్వటమే! బీజేపీని 272 సీట్లకు దిగువనే ఉంచటానికి కూటమిలోని ప్రతి ఒక్క పార్టీ తన పరిమితుల్ని అంగీకరించవలసి ఉంటుంది. పైకి అదే మంత పెద్ద విషయంగా అనిపించకపోయినా ప్రధానంగా అదే పెద్ద విషయం. కూటమి లబ్ధి కోసం పార్టీలు తమ ప్రయోజనాలను త్యాగం చేయటం అవసరం. అప్పుడు మాత్రమే ఇండియా కూటమి కనీసం 400 సీట్లలో ప్రత్యర్థితో ముఖాముఖి తలపడగలదు. అప్పుడు మాత్రమే ప్రతిపక్ష కూటమికి పడిన 60 శాతం ఓట్లు... పోటీలో ఉన్న ఎక్కువమంది అభ్యర్థుల మధ్య చీలిపోయే అవకాశం ఉండదని ఆశించవచ్చు. ఈ విషయం మీకు వివరంగా చెప్పడానికి కాంగ్రెస్‌ను నేను ఒక ఉదాహరణగా తీసుకుంటాను. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో ఇటీవలి చరిత్రలను చూస్తే కనుక అక్కడ కాంగ్రెస్‌కు ఉన్న విజయా వకాశాలు పరిమితమేననీ, వాటిని మెరుగుపరుచుకునే ప్రయత్నాలకు కూడా ఇది సమయం కాదనీ నిర్ధారణగా తెలుస్తుంది. 2014లో ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ రెండంటే రెండే లోక్‌సభ సీట్లను గెలుచుకుంది. యూపీలోనే 2022 విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు కూడా రెండే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఓట్లు వరుసగా 6.4. శాతం, 2.4 శాతం. బెంగాల్లో మరీ హీనం. అక్కడ 2019లో కాంగ్రెస్ రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. 2021 శాసనసభ ఎన్నికల్లోనైతే ఒక్క సీటు కూడా రాలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లభించిన ఓట్లు వరుసగా 5.7 శాతం, 3.1 శాతం. స్పష్టంగా తెలుస్తున్నది ఏమిటంటే, కాంగ్రెస్ ఎన్ని ఎక్కువ సీట్లకు పోటీ చేస్తే బీజేపీ అన్ని ఎక్కువ సీట్లలో గెలుస్తోంది. బిహార్‌లో సరిగ్గా ఇదే జరిగింది. 2020 బిహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 చోట్ల పోటీ చేస్తే, గెలిచింది 19 సీట్లు మాత్రమే. అంతకు ముందరి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలే ఇక్కడా పునరావృతం అయ్యాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 9 సీట్లకు పోటీ చేస్తే ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది. అయితే, ‘ఇండియా’ కూటమిలోని తక్కిన పార్టీలు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా త్యాగాలు చేయవలసిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. అవి: మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఈ రాష్ట్రాల్లో సమాజ్‌వాది, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు తమ ప్రయోజనాలకు అతీతంగా పని చేయాలి. ఆశల రెక్కల్ని చాపుకోడానికి వాటికిది సమయం కాదు. బీజేపీని ఆ రాష్ట్రా లలో ఓడించగల స్థానంలో ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఉంది. అలాగే ‘ఇండియా’ కూటమికి సమస్యాత్మకమైన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వాటిల్లో పంజాబ్, ఢిల్లీ ప్రధానమైనవి. పంజాబ్‌లో లోక్‌సభ స్థాయిలో కాంగ్రెస్ 8 సీట్లు, ఆమ్ ఆద్మీ 1 సీటు గెలుచు కున్నాయి. శాసనసభ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఈ పరిస్థితి పూర్తిగా తారుమారు అయ్యింది. ఆప్ 92 చోట్ల, కాంగ్రెస్ 18 చోట్ల విజయం సాధించాయి. ఇక ఢిల్లీలో కాంగ్రెస్ గానీ, ఆప్ గానీ ఒక్క లోక్‌సభ సీటును కూడా గెలుచుకోలేక పోయాయి. అయితే ఆప్ కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ రెండవ స్థానంలో నిలిచింది. ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో మాత్రం ఆప్‌దే పైచేయిగా ఉంది. ఈ రెండు రాష్ట్రాలలో కూడా కూటమి పార్టీల మధ్య సీట్ల విభజన అంత సులభమేమీ కాదు. అయినప్పటికీ అత్యాశతో అవి విభజనకు ప్రయత్నించాయా... బీజేపీ గెలిచినట్లే! నేను చెప్పాలనుకున్న ఈ విషయం ఎందుకింత సరళంగా, సూటిగా... అదే సమయంలో ఎందుకింత ముఖా నికి కొట్టొచ్చినంత స్పష్టంగా కూడా ఉన్నదో మీకు అర్థ మయిందా? నా ఈ విశ్లేషణతో విభేదించడం ‘ఇండియా’ కూటమికి స్వయంకృత పరాజయం మాత్రమే అవుతుం దన్న విషయాన్ని కూడా మీరు అంగీకరించగలరా? బీజేపీని 272 సీట్లకంటే తక్కువకు పరిమితం చేయడానికి ప్రతి పక్షాలు కనీసంలో కనీసంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే. త్యాగాలకు సిద్ధపడటం, అత్యాశను వదులుకోవటం. ఇవి కాకుండా వారు తెలుసుకోవలసినవి ఇంకొన్ని కూడా ఉన్నాయి. మొదటిది: ప్రధానమంత్రిపై వ్యక్తిగత విమర్శలు పనికిరావు. రెండు: అదానీ, క్రోనీ క్యాపిటలిజం (రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు కుమ్మక్కు అవటం), చైనా వైఖరి పట్ల మోదీ బలహీనమైన ప్రతిస్పందన, లేదా మైనారిటీలను తక్కువగా చూడటం అనే అంశా లేవీ ఓట్లు రాల్చేవి కాదు. ఈ రెండు విషయాలను పక్కన పెట్టి, సామాన్య ప్రజల దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తున్న ద్రవ్యో ల్బణం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు, పేదరికం వంటి వాటిపై కూటమి దృష్టి పెట్టాలి. ఇప్పుడు మరికొంచెం ముందుకు వెళతాను. ‘మోదీకి పోటాపోటీ ఎవరు?’ అనే ప్రశ్న... ‘ఇంకెవరు? రాహుల్‌గాంధీ’నే అనే సంసిద్ధ సమాధానంతో పూర్తవదని ఇండియా కూటమి స్పష్టతను కలిగి ఉండాలి. రాహుల్ గాంధీ కూడా తను కనీసం సంభావ్య ప్రధాని మంత్రి అభ్యర్థినైనా కానని స్పష్టం చెయ్యాలి. అవసరమైతే, నిస్సందే హంగా అది ఆమోదం పొందేవరకూ రాహుల్ పదే పదే దాన్ని పున రుద్ఘాటించాలి. చివరిగా కాంగ్రెస్‌కు ఒక మాట. మోదీని, బీజేపీని ఓడించడం తేలిక కాదు. ఆ పార్టీని 272 సీట్ల దిగువకు దింపడమే కాంగ్రెస్ పార్టీ 2024 లక్ష్యం కావాలి. 2029లో మాత్రమే కాంగ్రెస్ తను సొంతంగా మెజారిటీ సాధించేందుకు పని చేయాలి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
తన అంతరంగికుల చేతుల్లోనే పుతిన్ మరణం!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏదో ఒకరోజు తన అంతరంగికుల చేతుత్లోనే మరణిస్తాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఈ వ్యాఖ్యలు "ఈయర్" అనే ఉక్రెయిన్ డాక్యుమెంటరీ లోనివని న్యూస్‌వీక్ తన కథనంలో పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఈ డాక్యుమెంటరీని విడుదల చేసినట్లు న్యూస్‌వీక్ తెలిపింది. ఈ మేరకు జెలెన్స్కీ మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాయకత్వం బలహీనపడే సమయం ఆసన్నమైందన్నారు. అతని సన్నిహితులే అతనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునే పరిస్థితికి తీసుకువచ్చాడు. రష్యాలో పుతిన్ పాలనా దుర్భలత్వంపై విసుగు చెందే క్షణం వచ్చేసింది, అతని అతరంగికులే పుతిన్‌ని చంపేందుకు కారణాన్ని వెతికే పనిలో పడతారన్నారు. వారు కొమరేవ్, జెలెన్స్కీ వంటి పదాలను గుర్తు తెచ్చుకుంటూ.. చంపేందుకు యత్నిస్తుంటారన్నారు. పుతిన్‌పై అతని సన్నిహితులే విముఖంగా ఉన్నట్లు రష్యా నుంచి పలు నివేదికలు వచ్చిన నేపథ్యంలోనే జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అదీగాక వాషింగ్టన్ కూడా ఇటీవలే పుతిన్ పట్ల విసుగు చెందుతున్నట్లు ఓ నివేదికలో పేర్కొంది. ఉక్రెయిన్ తన మాతృభూమిని నియంత్రణలోకి తెచ్చుకోవడంతోనే ఈ యుద్ధానికి ముగింపు పలుకుతుందని చెప్పారు. ఇది మా భూమి.. మా ప్రజలు.. మా చరిత్ర.. ఉక్రెయిన్‌లోని ప్రతి మూలకు ఉక్రెయిన్ జెండాను తిరిగి అందిస్తాం అని జెలెన్స్కీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఐతే జెలెన్స్కీ తాజా వ్యాఖ్యలపై రష్యా నుంచి ఇంకా స్పందన రాకపోవడం గమనార్హం. (చదవండి: ఇటలీ పడవ ప్రమాదంలో 24 మందికి పైగా పాకిస్తానీలు గల్లంతు) -
ఒట్టేసి చెబుతున్న దేశద్రోహుల నుంచి రష్యాని ప్రక్షాళన చేస్తా!
Vladimir Putin warned he would cleanse Russia: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న భీకరమైన పోరు తారా స్థాయికి చేరుకుంది. ఉక్రెయిన్ లొంగక పోవడంతో రష్యా మరింత దుశ్చర్యలకు పాల్పడుతోంది. పైగా రష్యా దీన్ని ప్రత్యేక చర్య అని సమర్ధింకోవడమే కాక సైనిక స్థావరాలపైనే దాడి చేస్తున్నాను అని చెప్పుకుంటూ వస్తోంది. కానీ ఈ దాడిలో వేలాది మంది పౌరులు, చిన్నారులు మరణించారు. అంతేగాక ఉక్రెయిన్ సరిహద్దులు శరణార్థుల నిలయంగా మారిపోయింది. దీంతో అగ్రరాజ్యం రష్యాకి అడ్డుకట్టే వేసేలా ఆంక్షలు విధించడమే కాక ఉక్రెయిన్‌కి బాహాటంగానే మద్దతు ఇచ్చింది. అంతేగాక రష్యా అంర్జాతీయ స్పేస్ స్టేషన్ నుంచి తప్పుకుంటానని చెప్పడమేకాక అన్నంత పని చేసింది. మరోవైపు ప్రపంచ దేశాలన్నీ కలసి ఆర్థిక పరంగా ఆంక్షలు విధించి రష్యాను దిగ్బంధించాలనుకుంది. కానీ రష్యా వాటినన్నింటి లక్ష్య పెట్టలేదు కాదు కదా. ఉక్రెయిన్ పై వైమానిక దాడులతో మరింతగా విరుచుకుపడుతోంది రష్యా. ఆఖరికి అణుకర్మాగారం పై దాడులు చేసేందుకు యత్నించింది కూడా. పైగా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడుల చేయటం లేదంటూనే నివాసితులపై కాల్పులు జరిపించింది. ఉక్రెయిన్ శిధిలాల నిలయం మార్చేదాక వదలను అన్నట్లుగా దాడులు నిర్వహించింది. దీంతో అంతర్జాతీయ న్యాయస్థానం రంగంలోకి దిగి రష్యాను తక్షణమే దాడులు ఆపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఆఖరికి రష్యా వాదనను తోసిపుచ్చింది. మరోవైపు రష్యావాసులు సైతం రష్యా అధ్యక్షుడి తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాక పెద్ద ఎత్తున్న నిరసనలు చేపట్టారు. అదీగాక ఇటీవలే రష్యాలోని ఓ వార్తా ఛానెల్లో జర్నలిస్ట్ లైవ్‌లోనే యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఏంచేయాలో తెలియని పరిస్థితుల్లో వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడూ అగ్రదేశం, దాని మిత్రదేశాల పై ఆగ్రహంతో విరుచుకుపడుతున్నాడు. ఈ మేరకు ఒక వీడియో కాన్ఫరెన్స్‌లో అగ్రదేశంతో కలిసి పశ్చిమ దేశాలు రష్యాను నాశనం చేయాలనకుంటున్నాయని ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు పశ్చిమ దేశాలు అమెరికా కోసం రహస్యంగా పనిచేస్తున్నాయని కూడా చెప్పారు. అంతేకాదు ఒట్టేసి చెబుతున్న రష్యాను దేశద్రోహుల నుంచి ప్రక్షాళన చేస్తానంటూ అమెరికా దాని మిత్ర దేశాలను హెచ్చరించారు. అయినా రష్యన్ ప్రజలకు దేశద్రోహులు ఎవరో వారికి బాగా తెలుసని చెప్పారు. తాను స్వీయ ప్రక్షాళనతో దేశాన్ని పట్టిష్టంగా చేయగలనని, పైగా ఐక్యత, సంఘీభావంతో ఎలాంటి సవాలునైనా ఎదుర్కొగలనని విశ్వసిస్తున్నాని తెలిపారు. (చదవండి: రష్యాకి వ్యతిరేకంగా ఓటు...ఊహించని షాక్ ఇచ్చిన భారత న్యాయమూర్తి) -
భారత్‌పై కాట్సా.. బైడెన్‌దే నిర్ణయం
వాషింగ్టన్: అధునాతన సైనిక సంపత్తిని సమకూర్చుకోవాలన్న భారత్ ప్రయత్నాలకు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు అడ్డుకట్ట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాతోపాటు, దాని సన్నిహిత దేశాలపై పలు ఆంక్షలు విధిస్తున్న అమెరికా చూపు.. రష్యా నుంచి ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేస్తున్న భారత్‌పై పడింది. కాట్సా ఆంక్షలను కీలక భాగస్వామిగా ఉన్న భారత్‌పై వర్తింప జేసే విషయంలో అధ్యక్షుడు బైడెన్‌దే తుది నిర్ణయమని అమెరికా ఉన్నతాధికారి ఒకరు గురువారం తెలిపారు. ప్రస్తుత సమయంలో భారత్ రష్యాకు మరింత దూరంగా ఉండాలన్నారు. ఇప్పటికే రష్యాతో కుదుర్చుకున్న మిగ్–29, రష్యన్ హెలికాప్టర్లు, ట్యాంక్ విధ్వంసక ఆయుధాల కొనుగోలు ఒప్పందాలను భారత్ రద్దు చేసుకుందని చెప్పారు. ఇరాన్, ఉత్తరకొరియా, రష్యా దేశాలపై చెప్పుకోదగ్గ స్థాయిలో లావాదేవీలు నెరిపే దేశాలపై కౌంటరింగ్ అమెరికా యాడ్వర్సరీస్ థ్రూ శాంక్షన్స్ యాక్ట్(కాట్సా)ను ప్రయోగిస్తుంది. ఈ చట్టంతో రష్యా నుంచి రక్షణ రంగ కొనుగోళ్లు చేపట్టే దేశాలపై కఠినమైన ఆంక్షలు అమలవుతాయి. (చదవండి: రష్యా దళాలకు చెక్.. ఆ దిశగా ముందుకు సాగుతున్న అమెరికా బలగాలు) -
వారు కోరితే ప్రధానినవుతా
న్యూఢిల్లీ: ఒకవేళ మిత్రపక్షాలు కోరుకుంటే తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ తొలి ప్రాధాన్యమని వెల్లడించారు. ఎన్నికలు పూర్తయ్యాక అన్ని పక్షాలతో కలిసి చర్చించి ప్రధాని అభ్యర్థిపై తుదినిర్ణయం తీసుకుంటామన్నారు. శుక్రవారం నాడిక్కడ జరిగిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్–2018(హెచ్‌టీఎల్‌ఎస్)లో ప్రసంగించిన రాహుల్ పలువురు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ‘తొలుత కలిసికట్టుగా పోటీచేసి బీజేపీని ఓడించాలనీ, అనంతరం అందరూ కూర్చుని చర్చించి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలని మేం(ప్రతిపక్షాలు) నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ మా మిత్రపక్షాలు కోరుకుంటే నేను ప్రధానిగా బాధ్యతలు తప్పకుండా చేపడతా. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీచేసేందుకు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) నిరాకరించడంతో మాకు వచ్చిన నష్టమేమీ లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి విపక్షాలన్నీ ఏకమవుతాయి. మా అమ్మ సోనియాగాంధీ నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఓపిక తక్కువగా ఉండే నాకు ప్రశాంతంగా ఎలా ఉండాలో అమ్మ నేర్పించింది. కొన్నిసార్లు ‘అమ్మ నీకు ఓపిక మరీ ఎక్కువైంది’ అని నేను చెబుతుంటా’’ అని రాహుల్ చమత్కరించారు. మీ జీవితంలో ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారా? అన్న ప్రశ్నకు.. ‘ఎందుకులేరూ.. మా అమ్మ, సోదరి సహా నా జీవితంలో చాలామంది ఉన్నారు‘ అని రాహుల్ నవ్వుతూ జవాబిచ్చారు. సామాన్యులపై పెట్రో భారాన్ని తగ్గించేందుకు వీలుగా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తీసుకురావాలని రాహుల్ ప్రధాని మోదీని కోరారు. -
రాష్ట్రాల వారీగానే పొత్తులు: సురవరం
న్యూఢిల్లీ: బీజేపీని ఓడించటంతోపాటు లౌకిక ప్రజాస్వామ్య పార్టీలతో జట్టుకట్టే విషయంలో రాష్ట్రాల వారీగానే పొత్తులు పెట్టుకోనున్నట్లు సీపీఐ తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో∙ప్రత్యేక పరిస్థితులను బట్టి, వైఖరి మార్చుకుంటామని గురువారం విడుదల చేసిన రాజకీయ తీర్మానంలో పేర్కొంది. బీజేపీని గద్దె దించటమే తమ ఏకైక లక్ష్యమని స్పష్టం చేసింది. ఫాసిస్ట్ శక్తులపై పోరాడేందుకు లౌకిక రాజకీయ శక్తులను ప్రజా సంఘాలను కూడగడతామని పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. సీపీఎం, సీపీఐ మధ్య సమస్యలుంటే పరిష్కరించుకుంటామన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని సీపీఎం గతంలోనే తేల్చిచెప్పింది. -
పొత్తులు వేరు.. పోరాటాలు వేరు: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో కలసి పోరాటాలు చేయ డం, ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడం వేర్వేరని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి పోరాటా లు చేసినంత మాత్రాన ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటాయని కాదన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పొత్తుల గురించి మాట్లాడే అధికారం అధిష్టానానికి తప్ప తమకు లేదన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఏం మాట్లాడారో, ఎందుకలా మాట్లాడారో తనకు తెలియదని, ఎన్నికలకు చాలా సమయం ఉన్నందున ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడితే మంచిది కాదన్నారు. టీడీపీతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ శతృత్వం ఉందని, ఇక్కడ కూడా టీడీపీతో స్నేహం ఏమీ లేదన్నారు. ప్రజల సమస్యలపై అన్ని పార్టీల్లా టీడీపీతో కలసి పనిచేయడంలో తప్పేమీ లేదన్నారు. -
జయమ్మ ఝలక్.. ఒంటరి సవారీకి 'సై'
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరోసారి పెద్ద ఎత్తున రాజకీయ మేథోమదనానికి తెరతీశారు. ఈ ఎన్నికల్లో కూడా విజయం ఆమెకే అని వెల్లడైన సర్వేల ఫలితాలో లేక.. ఒంటరిగానే ఎన్నికల్లో దూసుకెళ్లి తన పవర్ ఏమిటో మరోసారి తమిళనాట రాజకీయ వర్గాలకు రుచి చూపించాలనుకునే సాహసమో ఆమె మొత్తానికి అందరూ అవాక్కయ్యే నిర్ణయం తీసుకున్నారు. మిత్ర పక్షాలకు కనీసం చేయి కూడా దులపకుండా దాదాపు అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించి ఝలక్ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒక్క ఏడు స్థానాలు తప్ప మిగితా 227 స్థానాల్లో ఏఐడీఎంకే పోటీ చేస్తుందని ఆమె సోమవారం స్పష్టం చేశారు. ఆ అభ్యర్థుల వివారలు కూడా ప్రకటించారు. జయలలిత మాత్రం ఇది వరకే పోటీ చేసిన చెన్నైలోని ఆర్కే నగర్ నుంచే బరిలోకి దిగుతున్నారు. మిత్ర పక్షాలకు కేవలం ఏడు సీట్లు మాత్రమే మిగిల్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. గతంలో ఏఐఏడీఎంకే 160 స్థానాల్లో పోటీ చేసి మిగితా సీట్లను మిత్ర పక్షాలకు ఇచ్చింది. పది మిత్ర పక్షాలను వెంటపెట్టుకొని ఎన్నికల బరిలో దిగింది. కాగా, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఇప్పటికే తన మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీకి 41 సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో 63 స్థానాలు కేటాయించిన డీఎంకే దాదాపు 22 స్థానాలు తగ్గించి 41 స్థానాలకే తగ్గించారు. ఏదైమైనా అధికార ప్రతిపక్ష పార్టీలు మాత్రం మిత్రపక్షాలపై ఆధారపడకుండా సొంతంగా అధికారం దక్కించుకోవాలని గట్టిగానే కసరత్తు చేసి సీట్ల కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, సీఎం అభ్యర్థి రేసులో తాను కూడా ఉన్నానంటూ దూసుకొస్తున్న అంతకుముందు జయతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో నిలబడిన డీఎండీకే పార్టీ చీఫ్, నటుడు విజయ్ కాంత్, ఎండీఎంకే, వీసీకే, వామపక్షాలతో పొత్తుపెట్టుకొని ఎన్నికల బరిలో దిగారు. -
పొత్తు... కసరత్తు
రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ పొత్తులపై కసరుత్తులు చేస్తుండగా అన్నాడీఎంకే, బీజేపీల మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల 2వ తేదీన కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ పొత్తుపై అధికారిక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఎత్తులు, జిత్తులతో పాటూ పొత్తుల కోసం పాకులాట మొదలైంది. కాంగ్రెస్, డీఎంకే పొత్తు దాదాపు ఖరారైపోయిం ది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాం ధీ నేతృత్వంలో ఇటీవల జరిగిన తమిళ కాంగ్రెస్ సమావేశంలో సైతం మాజీ మిత్రుడైన కరుణానిధితో చెలిమికి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. డీఎండీకే సహా మరికొన్ని ప్రాంతీయ పార్టీలను తమవైపు తిప్పుకునేందుకు డీఎంకే అధినేత కరుణానిధి ప్రయత్నాలు సాగిస్తున్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్ సహజంగానే ఏ విషయం తేల్చడం లే దు. వచ్చేనెల కాంచీపురంలో నిర్వహిం చేబోయే పార్టీ మహానాడులో విజయకాంత్ ఓ ప్రకటన చేస్తారని అంచనా వేస్తున్నారు. అయితే అన్నాడీఎంకేను ఓ డించడమే లక్ష్యంగా విజయకాంత్ చెబుతుండడంతో అదే లక్ష్యంతో ఉన్న కూట మిలోనే చేరుతారని భావించవచ్చు. పరస్పర సహకారం ఇదిలా ఉండగా, అధికార అన్నాడీఎంకే వైఖరిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరి పోటీ చేసి అఖండ విజయాన్ని అందుకున్న అమ్మపార్టీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సమయానికి అంతటి హవాను కోల్పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నాడీఎంకేకు ఓ తోడు అవసరమైంది. అలాగే పార్లమెంటు ఎన్నికల్లో అనేక ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన బీజేపీ కూటమి చెల్లాచెదురైంది. పీఎంకే, డీఎండీకే, ఎండీఎంకే పార్టీలన్నీ వేర్వేరుదారుల్లో ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీకి సైతం అన్నాడీఎంకేతో పొత్తు అనివార్యమైంది. రాష్ట్రంలో బలమైన కూటమి కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సైతం గట్టిప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే కూటమికి పార్టీలతో చర్చలు సాగించే బాధ్యతను కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్, రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై తదితరులకు బీజేపీ పెద్దలు అప్పగించా రు. ముఖ్యంగా అన్నాడీఎంకేని ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్రమంత్రులు ప్రకాశ్‌జవదేకర్, పియూష్ గోయల్‌లను సైతం బీజేపీ రంగంలోకి దించింది. బీజేపీ పెద్దలంతా ఇప్పటికే రహస్య చర్చలను ప్రారంభించారు. బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుపై రెండు పార్టీల్లో రసవత్తరమైన రహస్య చర్చలు సాగుతున్నాయి. మోదీతో ముహూర్తం: రాష్ట్రంలో బీజేపీ తరఫున అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చేనెల 2వ తేదీన కోయంబత్తూరుకు వస్తున్నారు. ఉదయం ఈఎస్ఐ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మోదీ వచ్చేలోగా పొత్తులను ఖరారు చేసుకోవాలని రాష్ట్ర నేతలు పరుగులు తీస్తున్నారు. అన్నాడీఎంకేతో పొత్తు ఖారైన పక్షంలో మోదీ సభలో రాష్ట్ర మంత్రులంతా పాల్గొంటారని ఆశిస్తున్నారు. ఇటీవల అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం అనుసరిస్తున్న తీరు అన్నాడీఎంకే, బీజేపీల స్నేహాన్ని పరోక్షంగా చాటిచెప్పింది. కాగా, వేదికపై నుండి మోదీ ప్రకటించడమే తరువాయిగా విశ్వసిస్తున్నారు. -
బీజేపీకి 160.. ఎల్జేపీకి 40!
ఆర్ఎల్ఎస్పీకి 23; మాంఝీ పార్టీకి 20 - బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే పక్షాల సీట్ల సర్దుబాటు - అసంతృప్తి లేదు: మాంఝీ; గెలుపు మా కూటమిదే: అమిత్ షా సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఎన్డీయే మిత్రపక్షాల మధ్య అవగాహన కుదిరింది. మొత్తం 243 స్థానాలకు గాను.. 160 సీట్లలో బీజేపీ, 40 స్థానాల్లో రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ), 23 స్థానాల్లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ), 20 సీట్లలో జతిన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ ఆవామ్ మోర్చా-సెక్యులర్(హెచ్ఏఎమ్-ఎస్) పోటీ చేయనున్నాయి. పాశ్వాన్, ఆర్ఎల్ఎస్పీ నేత ఉపేంద్ర కుష్వాహా, మాంఝీలతో కలసి సోమవారం మీడియా భేటీలో పాల్గొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ వివరాలను వెల్లడించారు. మిత్రపక్షాల్లో విబేధాలు లేవని, మాంఝీ పార్టీ నేతలు కొందరు బీజేపీ తరఫున పోటీ చేస్తారన్నారు. ఎన్నికల్లో ఎన్డీయే పూర్తి మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల లౌకిక కూటమి అవసరాల ప్రాతిపదికన ఏర్పడిన కూటమి కాగా, తమది బిహార్ అభివృద్ధి ధ్యేయంగా సైద్ధాంతిక ప్రాతిపదికన ఏర్పడిన కూటమి అని విశ్లేషించారు. ‘నితీశ్‌కుమార్ నేతృత్వంలోని కూటమి.. రూ.12 లక్షల కోట్ల స్కాం చేసిన కాంగ్రెస్‌తో కలిసి బిహార్‌లో అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇస్తోంది. జంగిల్రాజ్తో ప్రసిద్ధి చెందిన లాలూతో కలిసి నేరరహిత బిహార్‌కు హామీ ఇస్తోంది’ అని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లోనూ తమ ప్రధాన ప్రచారకర్త ప్రధాని మోదీనేనని అన్నారు. పాశ్వాన్‌తో విబేధాలు లేవు: మాంఝీ హెచ్ఏఎం-ఎస్‌కు బీజేపీ మొదట 13 నుంచి 15 సీట్లు ఇవ్వజూపిందని, ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించడం వల్లనే సీట్ల సర్దుబాటులో జాప్యం నెలకొందన్న వార్తలను మాంఝీ కొట్టేశారు. తమ పార్టీకి కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందానన్నారు. పాశ్వాన్ కన్నా దళితుల్లో తనకే ఎక్కువ పలుకుబడి ఉన్నందువల్ల తన పార్టీకే ఎక్కువ సీట్లు ఇవ్వాలని పట్టుబట్టారని వచ్చిన వార్తలను కూడా మాంఝీ తోసిపుచ్చారు. పాశ్వాన్‌తో తనకు విభేదాల్లేవన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని ఎల్జేపీకి కేటాయించిన స్థానాల కన్నా తక్కువ సీట్లకు ఎలా ఒప్పుకున్నారన్న ప్రశ్నకు.. ఈ అంశాన్ని అమిత్ షా ముందు లేవనెత్తానన్నారు. లౌకిక కూటమిలో కేటాయింపు చర్చలు.. బిహార్ ఎన్నికల్లో మహా లౌకిక కూటమి వేదికగా పోటీ చేస్తున్న జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు.. ఏయే స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలన్న విషయంపై చర్చలు కొనసాగిస్తున్నాయి. మిత్రపక్ష నేతల మధ్య సీఎం నితీశ్ నివాసంలో సోమవారం కూడా చర్చలు జరిగాయి. మొదటి, రెండో దశ ఎన్నికల్లో నియోజకవర్గాల కేటాయింపునకు సంబంధించి తుది ప్రకటన మంగళవారం వెలువడుతుందని ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ తెలిపారు. కలసి పోటీ చేయనున్న ఎస్పీ, ఎన్సీపీ ఈ ఎన్నికల్లో కలసి పోటీ చేయనున్నామని ఎస్పీ, ఎన్సీపీలు ప్రకటించాయి. పొత్తుపై కాంగ్రెస్, బీజేపీల వ్యతిరేక పార్టీలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయన్నాయి. కాగా, బిహార్‌లోని మొత్తం 62,779 పోలింగ్ బూత్‌ల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్ర పోలీసులను, హోంగార్డులను వివిధ అవసరాలకు వినియోగిస్తామని వెల్లడించింది. -
మహారాష్ట్రలో బిజెపిదే అధికారం