
పొత్తులు వేరు.. పోరాటాలు వేరు: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో కలసి పోరాటాలు చేయ డం, ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడం వేర్వేరని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి పోరాటా లు చేసినంత మాత్రాన ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటాయని కాదన్నారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పొత్తుల గురించి మాట్లాడే అధికారం అధిష్టానానికి తప్ప తమకు లేదన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఏం మాట్లాడారో, ఎందుకలా మాట్లాడారో తనకు తెలియదని, ఎన్నికలకు చాలా సమయం ఉన్నందున ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడితే మంచిది కాదన్నారు. టీడీపీతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ శతృత్వం ఉందని, ఇక్కడ కూడా టీడీపీతో స్నేహం ఏమీ లేదన్నారు. ప్రజల సమస్యలపై అన్ని పార్టీల్లా టీడీపీతో కలసి పనిచేయడంలో తప్పేమీ లేదన్నారు.