రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ పొత్తులపై కసరుత్తులు చేస్తుండగా అన్నాడీఎంకే, బీజేపీల మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల 2వ తేదీన కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ పొత్తుపై అధికారిక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి:
అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఎత్తులు, జిత్తులతో పాటూ పొత్తుల కోసం పాకులాట మొదలైంది. కాంగ్రెస్, డీఎంకే పొత్తు దాదాపు ఖరారైపోయిం ది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాం ధీ నేతృత్వంలో ఇటీవల జరిగిన తమిళ కాంగ్రెస్ సమావేశంలో సైతం మాజీ మిత్రుడైన కరుణానిధితో చెలిమికి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. డీఎండీకే సహా మరికొన్ని ప్రాంతీయ పార్టీలను తమవైపు తిప్పుకునేందుకు డీఎంకే అధినేత కరుణానిధి ప్రయత్నాలు సాగిస్తున్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్ సహజంగానే ఏ విషయం తేల్చడం లే దు. వచ్చేనెల కాంచీపురంలో నిర్వహిం చేబోయే పార్టీ మహానాడులో విజయకాంత్ ఓ ప్రకటన చేస్తారని అంచనా వేస్తున్నారు. అయితే అన్నాడీఎంకేను ఓ డించడమే లక్ష్యంగా విజయకాంత్ చెబుతుండడంతో అదే లక్ష్యంతో ఉన్న కూట మిలోనే చేరుతారని భావించవచ్చు.
పరస్పర సహకారం
ఇదిలా ఉండగా, అధికార అన్నాడీఎంకే వైఖరిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరి పోటీ చేసి అఖండ విజయాన్ని అందుకున్న అమ్మపార్టీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సమయానికి అంతటి హవాను కోల్పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నాడీఎంకేకు ఓ తోడు అవసరమైంది. అలాగే పార్లమెంటు ఎన్నికల్లో అనేక ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన బీజేపీ కూటమి చెల్లాచెదురైంది. పీఎంకే, డీఎండీకే, ఎండీఎంకే పార్టీలన్నీ వేర్వేరుదారుల్లో ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీకి సైతం అన్నాడీఎంకేతో పొత్తు అనివార్యమైంది. రాష్ట్రంలో బలమైన కూటమి కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సైతం గట్టిప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే కూటమికి పార్టీలతో చర్చలు సాగించే బాధ్యతను కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్, రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై తదితరులకు బీజేపీ పెద్దలు అప్పగించా రు. ముఖ్యంగా అన్నాడీఎంకేని ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్రమంత్రులు ప్రకాశ్‌జవదేకర్, పియూష్ గోయల్‌లను సైతం బీజేపీ రంగంలోకి దించింది. బీజేపీ పెద్దలంతా ఇప్పటికే రహస్య చర్చలను ప్రారంభించారు. బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుపై రెండు పార్టీల్లో రసవత్తరమైన రహస్య చర్చలు సాగుతున్నాయి.
మోదీతో ముహూర్తం: రాష్ట్రంలో బీజేపీ తరఫున అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చేనెల 2వ తేదీన కోయంబత్తూరుకు వస్తున్నారు. ఉదయం ఈఎస్‌ఐ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మోదీ వచ్చేలోగా పొత్తులను ఖరారు చేసుకోవాలని రాష్ట్ర నేతలు పరుగులు తీస్తున్నారు. అన్నాడీఎంకేతో పొత్తు ఖారైన పక్షంలో మోదీ సభలో రాష్ట్ర మంత్రులంతా పాల్గొంటారని ఆశిస్తున్నారు. ఇటీవల అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం అనుసరిస్తున్న తీరు అన్నాడీఎంకే, బీజేపీల స్నేహాన్ని పరోక్షంగా చాటిచెప్పింది. కాగా, వేదికపై నుండి మోదీ ప్రకటించడమే తరువాయిగా విశ్వసిస్తున్నారు.
పొత్తు... కసరత్తు
Published Thu, Jan 28 2016 1:37 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement