
Vladimir Putin warned he would cleanse Russia: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న భీకరమైన పోరు తారా స్థాయికి చేరుకుంది. ఉక్రెయిన్ లొంగక పోవడంతో రష్యా మరింత దుశ్చర్యలకు పాల్పడుతోంది. పైగా రష్యా దీన్ని ప్రత్యేక చర్య అని సమర్ధింకోవడమే కాక సైనిక స్థావరాలపైనే దాడి చేస్తున్నాను అని చెప్పుకుంటూ వస్తోంది. కానీ ఈ దాడిలో వేలాది మంది పౌరులు, చిన్నారులు మరణించారు. అంతేగాక ఉక్రెయిన్ సరిహద్దులు శరణార్థుల నిలయంగా మారిపోయింది. దీంతో అగ్రరాజ్యం రష్యాకి అడ్డుకట్టే వేసేలా ఆంక్షలు విధించడమే కాక ఉక్రెయిన్‌కి బాహాటంగానే మద్దతు ఇచ్చింది. అంతేగాక రష్యా అంర్జాతీయ స్పేస్ స్టేషన్ నుంచి తప్పుకుంటానని చెప్పడమేకాక అన్నంత పని చేసింది.
మరోవైపు ప్రపంచ దేశాలన్నీ కలసి ఆర్థిక పరంగా ఆంక్షలు విధించి రష్యాను దిగ్బంధించాలనుకుంది. కానీ రష్యా వాటినన్నింటి లక్ష్య పెట్టలేదు కాదు కదా. ఉక్రెయిన్ పై వైమానిక దాడులతో మరింతగా విరుచుకుపడుతోంది రష్యా. ఆఖరికి అణుకర్మాగారం పై దాడులు చేసేందుకు యత్నించింది కూడా. పైగా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడుల చేయటం లేదంటూనే నివాసితులపై కాల్పులు జరిపించింది. ఉక్రెయిన్ శిధిలాల నిలయం మార్చేదాక వదలను అన్నట్లుగా దాడులు నిర్వహించింది.
దీంతో అంతర్జాతీయ న్యాయస్థానం రంగంలోకి దిగి రష్యాను తక్షణమే దాడులు ఆపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఆఖరికి రష్యా వాదనను తోసిపుచ్చింది. మరోవైపు రష్యావాసులు సైతం రష్యా అధ్యక్షుడి తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాక పెద్ద ఎత్తున్న నిరసనలు చేపట్టారు. అదీగాక ఇటీవలే రష్యాలోని ఓ వార్తా ఛానెల్లో జర్నలిస్ట్ లైవ్‌లోనే యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఏంచేయాలో తెలియని పరిస్థితుల్లో వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడూ అగ్రదేశం, దాని మిత్రదేశాల పై ఆగ్రహంతో విరుచుకుపడుతున్నాడు.
ఈ మేరకు ఒక వీడియో కాన్ఫరెన్స్‌లో అగ్రదేశంతో కలిసి పశ్చిమ దేశాలు రష్యాను నాశనం చేయాలనకుంటున్నాయని ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు పశ్చిమ దేశాలు అమెరికా కోసం రహస్యంగా పనిచేస్తున్నాయని కూడా చెప్పారు. అంతేకాదు ఒట్టేసి చెబుతున్న రష్యాను దేశద్రోహుల నుంచి ప్రక్షాళన చేస్తానంటూ అమెరికా దాని మిత్ర దేశాలను హెచ్చరించారు. అయినా రష్యన్ ప్రజలకు దేశద్రోహులు ఎవరో వారికి బాగా తెలుసని చెప్పారు. తాను స్వీయ ప్రక్షాళనతో దేశాన్ని పట్టిష్టంగా చేయగలనని, పైగా ఐక్యత, సంఘీభావంతో ఎలాంటి సవాలునైనా ఎదుర్కొగలనని విశ్వసిస్తున్నాని తెలిపారు.
(చదవండి: రష్యాకి వ్యతిరేకంగా ఓటు...ఊహించని షాక్ ఇచ్చిన భారత న్యాయమూర్తి)
Comments
Please login to add a commentAdd a comment