ధర్నాచౌక్ తరలింపు వద్దు
- లేకపోతే ప్రజాగ్రహానికి తలవంచక తప్పదు: సురవరం
- తననెవరూ ప్రశ్నించరాదనే విచిత్రమైన మనస్తత్వం కేసీఆర్‌ది
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు నుంచి ధర్నాచౌక్ తరలింపుపై సీఎం కేసీఆర్ పునరాలోచించాలని.. లేకపోతే ప్రజాగ్రహానికి తలవంచక తప్పదని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు. తననెవరూ ప్రశ్నిం చరాదనే విచిత్రమైన మనస్తత్వం కేసీఆర్‌దని, అది ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కాదని విమర్శించారు. సొంత పార్టీలో ప్రశ్నించేవారు లేకుండా చేసుకున్న కేసీఆర్.. ఆ తరహాలో ప్రజల గొం తుకను నొక్కాలనుకుంటే సాధ్యంకాదని పేర్కొన్నారు. మఖ్దూంభవన్ వద్ద ‘సేవ్ ధర్నాచౌక్’ రిలే నిరసన దీక్షల్లో మంగళవారం ఆర్టీసీ, ఆటోరిక్షా సంఘాల ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. సురవరం దీక్షలను ప్రారంభించి, ప్రసంగించా రు. నిరసనలు తెలిపేందుకు ప్రభుత్వాల నుంచి ధర్నాచౌక్ రూపంలో సాధించుకున్న హక్కును టీఆర్‌ఎస్ కాలరాస్తోందని మండిపడ్డారు.
కేసీఆర్ ధర్నాచౌక్‌లో కూర్చునే రోజు వస్తుంది!
అధికారం శాశ్వతం కాదని, కేసీఆర్ మళ్లీ ధర్నాచౌక్‌లో కూర్చునే రోజులు వస్తాయని వ్యాఖ్యానిం చారు. తెలుగురాష్ట్రాల సీఎంలు విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి శాసనసభల్లో ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నారని, ప్రతిపక్షాలు లేకుండా ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం మూర్ఖపు ఆలో చనని విమర్శించారు. విపక్ష ఎమ్మెల్యేలు లేకపోతే బయట ప్రజలున్నారని, వారి ఆగ్రహాన్ని ప్రభుత్వాలు చవిచూడక తప్పదని హెచ్చరించారు. ఇక ధర్నాచౌక్ పునరుద్ధరణ అనేది ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశమని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. అధి కారంలోకి రాగానే కేసీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేల ను లొంగదీసుకున్నారని, ప్రజాహక్కులను కాలరాయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించా రు. ఈకార్యక్రమంలో కె.గోవర్ధన్ (న్యూడెమోక్రసీచంద్రన్న), మల్లేపల్లి ఆదిరెడ్డి (సీపీఐ), ఎస్.వెంకటేశ్వరరావు (న్యూడెమోక్రసీ–చంద్రన్న), వీఎస్ రావు (సీఐటీయూ), కె.సజయ (సామాజిక కార్యకర్త), దేవి చలపతిరావు (న్యూడెమోక్రసీ) పలు యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.