'ఆ ఎంపీకి కేబినెట్ హోదానా?'
నల్గొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన గాలికి వదిలి, ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడుతోందన్నారు. తన బిడ్డకు మంత్రి పదవి కోసం మోదీతో చర్చలు జరిపిన కేసీఆర్ హైకోర్టు విభజనపై మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ధరలను అదుపు చేయడంలో కేంద్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మోదీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో వెళ్తుందన్నారు. దళితులను కించపరిచిన ఓ ఎంపీకి కేబినెట్‌లో హోదా కల్పించడం సిగ్గుచేటన్నారు.