
విమోచనదినం వద్దనడం మూర్ఖత్వం
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు.
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై సురవరం మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. తెలంగాణ ఉనికిని చాటుకోవడానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 ఉంది కాబట్టి.. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించాల్సిన అవసరం లేదనడం మూర్ఖత్వమే అవుతుందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడు విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన టీఆర్‌ఎస్ పార్టీ.. ఇప్పుడు అధికారంలోని వచ్చాక ఎందుకు వెనకడుగు వేస్తోందని మండిపడ్డారు.