
పాలకుల అసహనానికి నిదర్శనం: సురవరం
నిరాహార దీక్షలు, ధర్నాలు అత్యంత శాంతి యుతమైన కార్యక్రమాలని, వాటిని అడ్డుకోవడం అసంబద్ధమని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పేర్కొన్నారు.
సాక్షి,, హైదరాబాద్: నిరాహార దీక్షలు, ధర్నాలు అత్యంత శాంతి యుతమైన కార్యక్రమాలని, వాటిని అడ్డుకోవడం అసంబద్ధమని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షాలు, ప్రజల నిరసనలు సహించలేని పాలకుల అసహనానికి ధర్నాలను అడ్డుకోవడం నిలువెత్తు నిదర్శనమని అన్నారు. దీనికి స్వయంగా ముఖ్యమంత్రి బాధ్యుడని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ కేంద్రం ఎక్కడుంటే దానికి దగ్గర్లోనే నిరసన తెలిపే స్థలముండాలని పేర్కొన్నారు. నగరం నడిబొడ్డున అసెంబ్లీ, సెక్రటేరియట్ ఉన్నంత కాలం ధర్నా చేసే హక్కుండాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు, సమస్యలు, నిరసనలు, డిమాండ్లను వివిధ రూపాల్లో వ్యక్తం చేసే హక్కుందని పేర్కొన్నారు.