
సాక్షి, హైదరాబాద్ : టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో బుధవారం భేటీ అయ్యారు. అధికార టీఆర్‌ఎస్‌ని ఓడించడమే లక్ష్యంగా రూపుదిద్దుకుంటున్న ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీలకు అసంతృప్తి ఉన్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సమావేశంలో రాజకీయ అంశాలు ఏమి చర్చించలేదు. కేవలం స్నేహపూర్వకంగానే కలవడానికి వచ్చానని తెలిపారు. సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదని వెల్లడించారు. భేటీకి సంబంధించి కొన్ని విషయాలను ఇప్పుడే చెప్పలేనని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment