
సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీల నేతలు విధానాలపై కాకుండా వ్యక్తిగతంగా విమర్శ లకు దిగడం సరికాదని సీపీఐ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. సంస్కారంలేని భాషను వాడితే రాజకీ యాలు, పార్టీలపై ప్రజలకు చులకనభావం ఏర్పడుతుందన్నారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్య దర్శి చాడ వెంకటరెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరాటం విమర్శల స్థాయి దాటి తిట్ల స్థాయికి చేరడం విచారకర మన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా దీనిని ప్రారంభిస్తే, మిగిలిన పార్టీలు కొన సాగిస్తున్నాయన్నారు. మంత్రి కేటీఆర్ ఇంకో పార్టీని లోఫర్ పార్టీ అంటూ మాట్లాడటం ఎందుకని సురవరం ప్రశ్నించారు. ఇలాంటి మాటల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకపోగా రాజకీయపార్టీలు, నాయకులపై విశ్వాసం పోతుందని హెచ్చరించారు. తెలం గాణకోసం ఉద్యమం ముందుగా ప్రజల నుంచి వచ్చిందని, ఆ తరువాతనే పార్టీలు ఉద్య మంలో పాల్గొన్నాయని అన్నారు. ఒక్క సీపీఎం పార్టీ ఒప్పుకోలేదని, మిగి లిన అన్ని పార్టీలు తెలం గాణ ఏర్పాటుకు మద్దతిచ్చాయన్నారు.
పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారంటూ ప్రధాని మోదీ అభ్యంతర కరంగా మాట్లాడారని విమర్శించారు. అప్ప ట్లో తాను ప్రధానిగా ఉంటే తెలంగాణ ఏర్పా టయ్యేది కాదన్నట్టుగా మోదీ ఉపన్యాసం ఉందని, పాకిస్తాన్ విభజనతో తెలంగాణ విభజనను పోల్చడం దారుణమన్నారు. నెహ్రూను అపఖ్యాతి పాలుచేయడానికి మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు.
భయంతోనే బాబు మాట్లాడుతున్నారు
జనంలో తిరుగుబాటు వస్తుందనే భయం తోనే ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీపై మాట్లాడుతున్నారని నారాయణ విమర్శిం చారు. ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీ ఇస్తామన్నప్పుడే బీజేపీపై పోరాడితే బాగుం డేదన్నారు. ఇప్పటికైనా కేంద్రంపై తిరుగు బాటు చేయాలని సూచించారు. ఏపీ బంద్ లో పాల్గొనకుండానే బంద్ విజయవంతం అయిందని టీడీపీ నాయకులు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.